AP Weather Report: నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో చాలా చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలో చాలా చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
విశాఖ పట్నంలో ఉరుములతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ..కోస్తాంధ్రకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు, బుధ, గురువారాల్లో అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ తెలిపారు.
ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెర శ్రీరాముళ్లు..
ఇదీ చదవండి: Sri Rama Navami 2025: వెండితెరపై సీతమ్మ వారి పాత్రల్లో మెప్పించిన నటీమణులు..
ఏప్రిల్ 11న ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు చెట్ల కింద నిలబడొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు ప్రజలు ఈ సమయాల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు సముద్రంలో తీవ్ర గాలులు వీచే అవకాశాలు ఉండటంతో మత్స్య కారులు ఈ సమయంలో సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది.
READ ALSO: Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..
READ ALSO: Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









