AP Rains: ఇటు గాలులు.. అటు పిడుగులు.. ఏపీకి బిగ్ అలర్ట్..

AP Rains: ఆంధ్ర ప్రదేశ్ లో   విభిన్న వాతావరణం కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని మూడు ఉమ్మడి జిల్లాలతో పాటు రాయలసీమకు చెందిన చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 18, 2025, 08:07 AM IST
AP Rains: ఇటు గాలులు.. అటు పిడుగులు.. ఏపీకి బిగ్ అలర్ట్..

AP Rains: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఒక వైపు ఎండలు కొడుతున్నా..మరికొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈసారి కర్నూలులో అత్యధికంగా 40.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు అనకాపల్లి జిల్లా చీడికాడలో అత్యధికంగా 42.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ విరుద్ధ వాతావరణ పరిస్థితుల వల్ల ప్రజలు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు ప్రజలు రహదారులపై ఇబ్బందులు పడుతున్నారు.

Add Zee News as a Preferred Source

ఈదురు గాలులతో పాటు వచ్చిన వర్షాలకు పలు జిల్లాల్లో పంట నష్టం సంభవించింది. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామలో అకాల వర్షల వలన పంటలు దెబ్బతిన్నాయి. కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం, ఎండు మిర్చి తడిసి ముద్దవుతున్నాయి. మామిడి తోటల్లో కాయలు నేలరాలిపోవడంతో రైతులు తీవ్ర నష్టాన్ని మూటగట్టుకున్నారు. మామిడి రైతులు ఇప్పటికే నాలుగు సార్లు ఈదురు గాలులకు బలై 60 శాతం కాయలను కోల్పోయినట్టు వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

భారత వాతావరణ శాఖ నైరుతి రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందన్న అంచనాతో రైతులకు ఊరటనిచ్చింది. ఏపీలో ఉత్తర కోస్తా జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, మిగిలిన జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశముంది. రాయలసీమ అంతటా అధిక వర్షాలు కురుస్తాయని వెల్లడించారు . ముఖ్యంగా కృష్ణా, గోదావరి బేసిన్‌ ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..

ఇదీ చదవండి:  ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News