)
AP Weather Alert: గత నెల రోజుల్లో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు ఉత్తరాది రాష్ట్రాలు కూడా వర్షాలకు అతలాకుతలం అవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాదిలో ఎక్కవగా క్లౌడ్ బరస్ట్ అనే మాటలు వినేవాళ్లము. కానీ తెలంగాణలో కూడా మేఘ విస్పోటనంతో కామారెడ్డి ని నీటితో ముంచెత్తింది. గత నెల 27 అక్కడ దాదాపు 60 సెం.మీ రికార్డు వర్షపాతం నమోదు కావడంతో దాదాపు వారం రోజులుగా జలదిగ్భందనంలో చిక్కుతుంది. గతేడాది విజయవాడలో కూడా బుడమేరు పొంగి విజయవాడ పరిసర ప్రాంతాలు నిండా మునిగాయి. ప్రభుత్వం ఎంత చేసినా.. ప్రకృతి కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో ఈ వర్షలు నిరూపించాయి. ఈ సారి తెలంగాణతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గండిపేట, హిమాయత్ సాగర్ నిండు కుండలను తలపించాయి. అటు మూసి, మంజీరా నదులు కూడా ఎన్నడు లేనట్టుగా పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఏడుపాయల అమ్మవారి దేవాలయాన్ని దాదాపు 10 రోజులుగా మూసి ఉంటారు.
అటు ఏపీలో పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. మరి క్లౌడ్ బరస్ట్ కానున్న వర్ష బీభత్సానికి చేతికి వచ్చిన పంటలు నీట మునిగాయి. ఆ సంగతి పక్కన పెడితే.. ఏపీలో మళ్లీ భారీ వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, మన్యం, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అదే విధంగా సెప్టెంబర్ 13న బంగాళాఖాతంలో అప్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ విభాగం అంచనా వేసింది.
ఈ అల్పపీడనం పశ్చిమ-వాయివ్య దిశగా పయనించే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో సెప్టెంబర్ నెలాఖరు వరకు వర్షాలు కురుస్తాయని భారత వాతవరణ శాఖ అంచనావేసింది. వచ్చే నాలుగు రోజుల్లో పలుచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అకాశం ఉందని తెలిపింది. అటు తెలంగాణలో కూడా రాగల 48 గంటల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.