AP Rains: గత కొన్నేళ్లుగా వాతావరణంలో పలు మార్పులు సంభవిస్తున్నాయి. ఇక ఎండా కాలంలో వర్షాలు పడటం కామన్. కానీ ఈ సారి మాత్రం ఎక్కువ నీటి ఆవిరి కారణంగా మేఘాలు ఏర్పడి వర్షాలు పడుతున్నాయి. ప్రజలు ఈ భిన్నమైన వాతావరణ పరిస్థితుల పట్ల అప్రమత్తత వహించాలని వాతావరణ శాఖ పేర్కోంది.
ముఖ్యంగా మంగళవారం నాడు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, ప్రకాశం, అల్లూరి సీతారామరాజు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఆస్కారం ఉందని తెలిపారు.
ఉరుములతో కూడిన వర్షం పడుతున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద నిలబడవద్దని అధికారులు స్పష్టం చేశారు. సురక్షితమైన భవనాల్లో లేదా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు. అలాగే, వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే రైతులు కూడా వాతావరణ మార్పులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అంతేకాదు ఆరు బయట ఎలాంటి పంటలు ఎండబెట్టకూడదని తెలిపారు. అంతేకాదు కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే గోడౌన్స్ కు తరలించాలని సూచించారు.
READ ALSO: Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..
READ ALSO: Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









