)
AP Weather Update: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్ లో తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఒడిశా, ఆంధ్ర సరిహద్దుల్లోనే వాయుగుండంగా తీరం దాటింది. అటు ఉత్తరాంధ్ర జిల్లాలోని శ్రీకాకుళం, విజయ నగరం, విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలకు చెట్లు నేలకొరిగాయి. అంతేకాదు పలు ప్రాంతాల్లో రహదారులు అతలాకుతలం అయ్యాయి. నిన్న రాత్రి గోపాల్ పూర్ - పారాదీప్ మధ్య వాయు గుండం తీరం దాటడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అటు ఉత్తర కోస్తా జిల్లాలలో పాటు దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద సముద్రం 500 మీటర్లు వెనక్కి వెళ్లింది. అంతర్వేది తీర ప్రాంతంలో మోకాళ్ల లోతు ఒండ్రు మట్టితో నిండిపోయింది. సునామి హెచ్చరికలు ఉన్నపుడే ఇలా సముద్రం వెనక్కి వెళుతుందని గతంలో సునామీ వచ్చిన రోజులను గుర్తు చేసుకుంటున్నారు. దీంతో అంతర్వేది తీర ప్రాంత ప్రజలు భయం గుప్పిట్లో ఎపుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో అని బిక్కు బిక్కు మంటున్నారు.
ఇప్పటికే విశాఖ పట్నంలో వానలు అల్లకల్లోలం క్రియేట్ చేసింది. గంటలకు 300 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయడంతో పలు ప్రాంతాల్లో విద్యుత స్తంభాలు నేలకొరిగాయి. దీంతో పలు ప్రాంతాల్లో అంధకారం అలముకుంది. ఇక విద్యుత్ పంపిణి సంస్థలు కూడా ఎప్పటికపుడు యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేపడుతున్నారు. ఈదురు గాలులు పలు చోట్ల దసరా సందర్భంగా ఏర్పాటు చేసిన హోర్డింగ్ లు , కటౌట్స్ అన్ని పడిపోయాయి. అటు రోడ్లన్ని జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో అక్కడ రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. పలు కాలనీల ప్రజలు నీటి గుప్పెట చిక్కుకున్నాయి. దీంతో ఏం చేయాలో పాలు పోవడం లేదు. మరోవైపు కరెంట్, నెట్ పనిచేయకపోవడంతో పలు ఇబ్బందులను ఫేస్ చేస్తున్నారు. మరోవైపు విశాఖలో 0891 2590 100, 0891 2590 102 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.
అరకు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో రహదారులపై చెట్లు విరిగిపడిపోవడంతో రహదారి స్తంభించి పోయింది. మరోవైపు ఏపీ విపత్తుల సంస్థ పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మన్యం, అల్లూరి, విజయ నగరం, శ్రీకాకుళం, అనకా పల్లిలకు రెడ్ అలర్డ్ జారీ చేసింది. పలుమైన ఈదురు గాలులతో కూడిన వర్షాలకు పలు ప్రాంతాల్లో ఇంటి కప్పులు ఎగిరిపోయాయి. ప్రజలకు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.