Heat Waves Alert: ఏపీకు బిగ్ అలర్ట్, ఈ జిల్లాల్లో రానున్న మూడ్రోజులు తీవ్రమైన వడగాలులు

Heat Waves Alert: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రోజురోజుకూ ఎండలు పెరిగిపోతున్నాయి. రానున్న మూడు రోజులు చాలా అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రత్యేకించి ఈ జిల్లాలకు హై అలర్ట్ జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 16, 2025, 09:41 PM IST
Heat Waves Alert: ఏపీకు బిగ్ అలర్ట్, ఈ జిల్లాల్లో రానున్న మూడ్రోజులు తీవ్రమైన వడగాలులు

Heat Waves Alert: గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎండలు తీవ్రంగా ఉంటున్నాయి. మార్చ్ లోనే ఉష్ణోగ్రతలు 35 నుంచి 42 డిగ్రీల వరకూ చేరుకుంటున్నాయి. సాధారణం కంటే 4-5 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇక వచ్చే మూడు రోజులు తీవ్రమైన వడగాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది. 

Add Zee News as a Preferred Source

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. తీవ్రమైన ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. రానున్న మూడు రోజులు మరింత ఎక్కువగా ఎండలు ఉంటాయని తెలుస్తోంది. సోమవారం అంటే మార్చ్ 17 నుంచి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని 8 మండలాలు, విజయనగరం జిల్లాలోని 15 , పార్వతీపురం మన్యం జిల్లాలో 12 మండలాల్లో వడగాలులు అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 167 మండలాల్లో రేపు అంటే సోమవారం వడగాలుల ప్రభావం ఉంటుంది. శ్రీకాకుళం జిల్లాలో 16, విజయనగరం జిల్లాలో 10, పార్వతీపురం మన్యం జిల్లాలో 3, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 9, విశాఖపట్నంలో 2 అనకాపల్లిలో 16, కాకినాడలో 15, కోనసీమలో 9, తూర్పు గోదావరి జిల్లాలో 19, పశ్చిమ గోదావరి జిల్లాలో 3, ఏలూరులో 13, కృష్ణాలో 10, ఎన్టీఆర్ జిల్లాలో 8, గుంటూరులో 14, బాపట్లలో 1, పల్నాడులో 19 మండలాల్లో వడగాలులు వీయనున్నాయి. 

ఇక మార్చ్ 18 మంగళవారం 25 మండలాల్లో తీవ్ర వడగాలులు, 89 మండలాల్లో మోస్తరు వడగాలులు వీయనున్నాయి. మార్చ్ 19, 20 తేదీల్లో కూడా అటు ఉష్ణోగ్రతతో పాటు వడగాలులు అధికంగా ఉంటాయి. ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. నిన్న రాష్ట్రంలోని అనకాపల్లిలో 42.1 డిగ్రీ, నంద్యాల, విజయనగరంలో 41.8 డిగ్రీలు, ప్రకాశం జిల్లా, కర్నూలు జిల్లాలో 41.4 డిగ్రీలు పార్వతీపురంలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 

ఇక వడగాలులైతే రాష్ట్రంలోని 14 మండలాల్లో తీవ్రంగా ఉంటే 56 మండలాల్లో మోస్తరు ఉన్నాయి. రానున్న రోజుల్లో వడగాలులు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉన్నందున వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్ర్తత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

Also read: IPL 2025 SRH Team: భారీ అంచనాలతో సన్‌రైజర్స్ హైదరాబాద్, ప్లేయింగ్ 11 ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News