AP Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలో మరో మూడు రోజులు వర్షాలే

AP Rains Alert: మండు వేసవిలో భగభగ మండుతున్న ఎండల నుంచి ప్రజలకు ఊరట లభించనుంది. రానున్న 3 రోజులు ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 7, 2025, 12:07 PM IST
AP Rains Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలో మరో మూడు రోజులు వర్షాలే

AP Rains Alert: మండుతున్న ఎండల నుంచి ఏపీ ప్రజలకు మరోసారి ఊరట లభించనుంది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడ్రోజులు భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఫలితంగా రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయి. 

Add Zee News as a Preferred Source

మండే ఎండల నుంచి ఏపీ ప్రజలకు బిగ్ రిలీఫ్ కలగనుంది. బంగాళాఖాతంలో ఏప్రిల్ 8 నాటికి అల్పపీడనం ఏర్పడనుంది. మరో వైపు ఉపరితల ఆవర్తనం తీరానికి సమాంతరంగా కదులుతూ బంగ్లాదేశ్, మయన్మార్ వైపుగా పయనించనుంది. దాంతో రానున్న 3 రోజులు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. ఈసారి రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు పడనున్నాయని ఐఎండీ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో రానున్న మూడు రోజులు వర్షాలు విస్తారంగా కురవనున్నాయి. 

ఉత్తర, మధ్య మహారాష్ట్ర నుంచి ఉత్తర తమిళనాడు వరకు విస్తరించి ఉన్న అల్పపీడన ద్రోణి మరాఠ్వాడ నుంచి దక్షిణ తమిళనాడు, కర్ణాటక మీదుగా సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లోని ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఫలితంగా రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి. అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. వర్షాల కారణంగా ఏపీలోని ఈ జిల్లాల్లో వాతావరణం చల్లబడనుంది. 

మరో వైపు నిన్న ఆదివారం కర్నూలు, ప్రకాశం, నంద్యాల, శ్రీకాకుళం, పల్నాడు జిల్లాల్లో 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రత నమోదైంది. ఉత్తరాంధ్ర 39-41 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాయలసీమలో 41-43 డిగ్రీలు నమోదవుతోంది. 

Also read: Pan Card Alert: బిగ్ అలర్ట్ ఇదే చివరి అవకాశం, లేకపోతే మీ పాన్‌కార్డు రద్దయిపోతుంది జాగ్రత్త

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Trending News