Anna Lezhneva: గుండు చేయించుకున్న 'కొణిదెల' కోడలు.. కన్న కొడుకు కోసం 'తల్లి ఆరాటం'

Anna Lezhneva Clean Shaves Head In Tirumala: కొడుకు మార్క్‌ శంకర్‌ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడడంతో డిప్యూటీ సీఎం సతీమణి అన్నాలెజ్నెవా తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తన కుమారుడి కోసం ఆమె తిరుమలలో తలనీలాలు సమర్పించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 13, 2025, 08:50 PM IST
Anna Lezhneva: గుండు చేయించుకున్న 'కొణిదెల' కోడలు.. కన్న కొడుకు కోసం 'తల్లి ఆరాటం'

Anna Lezhneva Bald Shaves: తన కుమారుడు మార్క్‌ శంకర్‌ కోసం అన్నాలెజ్నెవా ఆరాట పడుతున్నారు. తన కుమారుడిని క్షేమంగా ప్రమాదం నుంచి బయటపడినందుకు తిరుమలలో ఆమె తలనీలాలు సమర్పించారు. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సతీమణి అన్నాలెజ్నెవా గుండు చేయించుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన వారంతా కొడుకు తల్లి ఆరాటం.. తపన అని పేర్కొంటున్నారు. అన్నాలెజ్నెవాపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Add Zee News as a Preferred Source

Also Read: IAS Transfers: ఏపీ ప్రభుత్వం సంచలనం.. 'జగన్‌' అధికారులకు బదిలీలు, పోస్టింగ్‌లు

సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదం నుంచి బయటపడిన తన కుమారుడు మార్క్‌ శంకర్‌ కోసం అతడి తల్లి అన్నాలెజ్నెవా ఆరాట పడుతున్నారు. కుమారుడు ప్రమాదం బారినపడినప్పటి నుంచి ఆమె ఆందోళన చెందుతున్నారు. సింగపూర్‌ వెళ్లి తన భర్త పవన్‌ కల్యాణ్‌, బావ చిరంజీవితోపాటు కలిసి తిరిగి హైదరాబాద్‌ వచ్చారు. హైదరాబాద్‌ చేరుకున్నారో లేదో ఆమె మరుసటి వెంటనే తిరుమల చేరుకున్నారు. 'తిరుమల వెంకటేశ్వరుడే తన కుమారుడిని కాపాడారని.. అందుకే స్వామికి మొక్కులు చెల్లించేందుకు తిరుమల వచ్చారు' అని చర్చ జరుగుతోంది.

Also Read: Kailasapatnam Fireworks: 'కైలాసపట్నం' ప్రమాదంపై సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి

సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్‌ కల్యాణ్‌, అన్నా లెజ్నెవా కుమారుడు మార్క్‌ శంకర్‌ స్వల్ప గాయాలపాలైన విషయం తెలిసిందే. వైద్యం అనంతరం తల్లిదండ్రులతో హైదరాబాద్‌ వచ్చేశాడు. అయితే తన కుమారుడిని తిరుమల వెంకటేశ్వర స్వామి కాపాడారని పవన్‌ కల్యాణ్‌ సతీమణి అన్నా లెజ్నెవా భావిస్తున్నారు. తన కుమారుడు క్షేమంగా బయటపడడంతో స్వామివారికి మొక్కులు చెల్లించుకునేందుకు అన్నా లెజ్నెవా తిరుమల చేరుకున్నారు.

రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా గాయత్రి నిలయంలో బస చేశారు. కొండపై ఆదివారం నిద్ర చేసిన అనంతరం సోమవారం వేకువజామున సుప్రభాత సేవలో ఆమె పాల్గొననున్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. రష్యా దేశస్తురాలైన అన్నాలెజ్నోవా క్రైస్తవురాలు. పరమతస్తులు తిరుమలను సందర్శించాలంటే టీటీడీ నిబంధనల ప్రకారం డిక్లరేషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది.  ఈ మేరకు అన్నాలెజ్నెవా ఆ డిక్లరేషన్‌పై సంతకం చేసి టీటీడీ అధికారులకు ఇచ్చారు.

అనంతరం తిరుమలలో ఆమె తలనీలాలు సమర్పించారు. టీటీడీ అధికారులు దగ్గరుండి ఆమెకు తలనీలాల ఏర్పాట్లు చేశారు. ఆమె తలనీలాలు సమర్పిస్తున్న వీడియో, ఫొటోలు వైరల్‌గా మారాయి. ఏమాత్రం ఇబ్బంది లేకుండా.. తాను ప్రముఖ రాజకీయ నాయకురాలి భార్య అనే భావన లేకుండా అన్నాలెజ్నెవా గుండు చేయించుకున్నారు. గుండు చేయించుకునే ముందు తిరుమల వెంకటేశ్వరుడికి మనసులో తలచుకున్నారు. తలనీలాలు సమర్పించిన అనంతరం తాను బస చేసిన అతిథిగృహానికి ఆమె చేరుకున్నారు. తిరుమల స్వామివారి దర్శనం అనంతరం అన్నా లెజ్నెవా తిరిగి హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. తిరుమలలో ఉన్నంత సేపు టీటీడీ అధికారులు దగ్గరుండి ఆమెకు ప్రత్యేకంగా గౌరవ మర్యాదలు చూసుకుంటూనే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రముఖుల స్పందన
కాగా సింగపూర్‌లో చదువుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, అన్నాలెజ్నెవా చిన్న కుమారుడు మార్క్‌ శంకర్‌ ఇటీవల అగ్నిప్రమాదం బారిన పడిన విషయం తెలిసిందే. తృటిలో ఆ ప్రమాదం నుంచి తప్పించుకుని స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అప్పటి నుంచి మార్క్‌ శంకర్‌ ఆరోగ్యంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, రాజకీయ పార్టీల నాయకులు షాక్‌కు గురయ్యారు. చిన్నారి త్వరగా కోలుకోవాలని అందరూ ఆకాంక్షించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News