Anna Lezhneva: కొడుకు కోసం తలనీలాలు సమర్పించిన అన్నా లెజినోవా.. ఇది కదా అమ్మ ప్రేమంటే..

Anna Lezhneva: ఆంధ్ర ప్రదేశ్  డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువ జామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 14, 2025, 11:01 AM IST
Anna Lezhneva: కొడుకు కోసం తలనీలాలు సమర్పించిన అన్నా లెజినోవా.. ఇది కదా అమ్మ ప్రేమంటే..

Anna Lezhneva Visits Tirumala : పవన్ కళ్యాణ్ భార్య అన్నాలెజినోవా.. సింగపూర్ లో జరిగిన దుర్ఘటనలో తన కుమారుడు ప్రాణాలతో బయట పడటంతో తిరుమల శ్రీవారిని దర్శించుకొని తన మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం సుప్రపాత దర్శనం చేసుకున్నారు. న అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలను అధికారులు అందజేశారు. అంతకుముందు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ వద్ద TTD అధికారులు అన్నా లెజినోవాకు  స్వాగతం పలికారు.

Add Zee News as a Preferred Source

తమ కుమారుడు మార్క్‌ శంకర్‌ అగ్ని ప్రమాదానికి గురై స్వల్ప గాయాలతో బయటపడటంతో అన్నా లెజినోవా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆదివారం సాయంత్రమే ఆమె తిరుమలకు చేరుకున్నారు. స్థానిక గాయత్రీ నిలయంలో ఆమె బస చేశారు. క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ.. తొలుత ఆమె శ్రీ భూవరాహస్వామి ఆలయం వద్దకు చేరుకుని స్వామిని దర్శించుకున్నారు.

అనంతరం శ్రీపద్మావతి విచారణ కేంద్రం వద్ద ఉన్న కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. అన్య మతస్థురాలు కావడంతో మొదట అతిథిగృహంలో డిక్లరేషన్‌పై సంతకం చేశారు. ఈ రోజు ఉదయమే వేకువ ఝామున శ్రీ తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని తన మొక్కులు చెల్లించుకున్నారు.

READ ALSO:  Chiranjeevi: చిరంజీవికి భార్యగా..చెల్లిగా.. అక్కగా.. తల్లిగా నటించిన ఏకైక హీరోయిన్..

READ ALSO:  Prabhas Vs Venkatesh: కథ ఒక్కటే.. వెంకటేష్ డిజాస్టర్.. ప్రభాస్ బ్లాక్ బస్టర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News