Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ బిగ్‌ అప్‌డేట్‌.. కొన్ని గంటల్లో బ్యాంకు ఖాతాల్లోకి రూ.14 వేలు

AP Govt Will Deposit Rs 14000 Into Farmers Bank Accounts On June 30th: రైతులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. పంట పెట్టుబడి సహాయం అందించే 'అన్నదాత సుఖీభవ' డబ్బులు త్వరలోనే బ్యాంకుల ఖాతాల్లో వేయనుంది. దీనికి సంబంధించి ప్రక్రియ వేగవంతమైంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 25, 2025, 02:59 PM IST
Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ బిగ్‌ అప్‌డేట్‌.. కొన్ని గంటల్లో బ్యాంకు ఖాతాల్లోకి రూ.14 వేలు

Farmers Bank Accounts: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రైతులకు తియ్యటి వార్త చెప్పింది. పంట పెట్టుబడి సహాయం అందించే 'అన్నదాత సుఖీభవ' పథకం ఎప్పటి నుంచి అమలవుతుందో చెప్పేసింది. అన్నదాత సుఖీభవకు సంబంధించిన తొలి విడత డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు సిద్ధమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం గతంలో అమలవుతున్న రైతు భరోసా పథకాన్ని 'అన్నదాత సుఖీభవ'గా పేరు మార్చింది. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభించేందుకు సిద్ధకమైంది.

Add Zee News as a Preferred Source

Also Read: Amaravati Donation: రాజధాని అమరావతికి వృద్ధ మహిళ 4 బంగారు గాజులు విరాళం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఒక్కోటి అమలు చేస్తూ వస్తోంది. పింఛన్ల పెంపు, తల్లికి వందనం వంటివి అమలు చేయగా.. ఈ క్రమంలోనే రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేసేందుకు ఎన్డీయే ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజనతో కలిపి అన్నదాత సుఖీభవ పథకం ఏపీ ప్రభుత్వం అమలు చేయనుంది.

Also Read: YS Jagan: వీడియోను బయటపెట్టిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌

కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్‌ యోజన్‌ కింద ప్రతియేటా రైతులకు రూ.6 వేలు మూడు విడతలుగా జమ చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి జతగా ఏపీ ప్రభుత్వం ఏడాదికి రూ.14 వేలు అందిస్తోంది. అయితే రూ.14 వేలను రెండు విడతల్లో రూ.7 వేల చొప్పున ఏపీ ప్రభుత్వం విడుదల చేస్తోంది. తొలి విడతలో భాగంగా ఈ నెలాఖరులో అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.7 వేలు జమ చేసేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.

అన్నదాత సుఖీభవ పథకాన్ని పీఎం కిసాన్ యోజనతోపాటు ఈనెల 20వ తేదీన అమలు చేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే కేంద్రం జూన్ 20న పీఎం కిసాన్ యోజన 20వ ఇన్‌స్టాల్‌మెంట్ నిధులను విడుదల చేయకపోవడంతో అన్నదాత సుఖీభవ పథకం అమలు కూడా వాయిదా పడింది. ఈనెల చివరి నాటికి పీఎం కిసాన్ యోజన నిధులు కేంద్ర ప్రభుత్వం జమ చేయనుంది. దానికి అనుగుణంగా అన్నదాత సుఖీభవ పథకం నిధులను కూడా ఏపీ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది.

అర్హులు వీరే
అన్నదాత సుఖీభవ పథకం కింద మొత్తం 45.71 లక్షల రైతు కుటుంబాలు అర్హులుగా ఏపీ ప్రభుత్వం తేల్చింది.
తొలి విడతగా జూన్‌లో రూ.7000
అక్టోబర్‌లో రెండో విడతగా రూ.7 వేలు జమ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News