Annavaram: ఈ మధ్యకాలంలో తిరుమలలో మాంసాహారంతో ఒకరు కొండపైకి రావడం.. ఇంకోసారి మద్యం బాటిల్లతో కొంత మంది పట్టుపడిన సంగతులు మరవక ముందే తిరుమల తర్వాత శ్రీ వైష్ణవులకు పరమ పవిత్రంగా భావించే అన్నవరంలో ఘోర అపచారం జరిగింది.
అవును శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి కొలువుండే అన్నవరం దేవస్థానంలో ఘోరమైన అపచారం జరిగింది. దేవస్థానం కాటేజీలో బీరు బాటిళ్లు లభ్యం కావడంపై తీవ్ర దుమారం రేపుతోంది. కొండ దిగువున సత్యనికేతన్ కాటేజీ వద్ద ఆలయ ఇ.ఒ వీర్ల సుబ్బారావు ఆకస్మిక తనిఖీలు చేపట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
కాటేజ్ రూమ్స్ ప్రాంగణంలో బీరు బాటిల్ దర్శనమివ్వడం కలకలం రేపింది. కొంతకాలంగా కొన్ని గదులు పోలీసులు ఆధ్వర్యంలో ఉన్నట్లు సమాచారం. దేవస్థానంలో సత్య నికేతన్ గదులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. విషయం తెలుసుకున్న ఈవో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ ఘటనపై భక్తులు మండిపడుతున్నారు.భక్తులు పరమ పవిత్రంగా భావించే ఆలయ పరిపరాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంపై హిందూ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









