)
Amaravati Buildings: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేయగా.. కూటమి ప్రభుత్వం రావడంతో రాజధాని పనుల్లో కదలిక వచ్చింది. ప్రస్తుతం అక్కడ చకచకా పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే పరిపాలనా భవనాల్లో ఒకటైన అసెంబ్లీకి అదనంగా మరో భవనం ప్రారంభమైంది. శాసనసభ అనుబంధ భవనాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. ఇన్నాళ్లు అసెంబ్లీలో ఇబ్బందులు ఉండగా అదనపు భవనం రాకతో ఇక ఇబ్బందులు తొలగిపోయాయి.
ఏపీ అసెంబ్లీలో అదనపు భవనాన్ని గురువారం స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ ప్రారంభించారు. జీ ప్లస్ 1 విధానంలో మొత్తం 14,074 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన భవనం అందుబాటులోకి వచ్చింది. గ్రౌండ్ ఫ్లోర్లో మీడియా రూమ్, కిచెన్, డైనింగ్ రూమ్, వాష్ రూమ్‌లు, మొదటి అంతస్తుల్లో విప్ల కోసం 16 చాంబర్లు, వెయిటింగ్ హాల్, సర్వర్ రూమ్ ఉన్నాయి.
భవనంలో చీఫ్ విప్‌లు, విప్‌లకు గదులు కేటాయించినట్లు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. రూ.3. 57 కోట్లతో ఈ భవనాన్ని 16 క్యాబిన్లతో ఆదునీకరించినట్లు వివరించారు. మీడియా కు సిట్టింగ్‌కు, ఇతర సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ భవనాన్ని అంచనా కన్నా తక్కువలో పూర్తి చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. విప్‌లకు 16 ఛాంబర్లు, డైనింగ్, మీడియా పాయింట్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
'ఎక్కడ దుబారా ఉండకూడదు అని ఈ ప్రభుత్వం భావిస్తుంది. ఆ పనిని శాసన వ్యవస్థ నుంచే ప్రారంభించాం. రూ.ఐదు కోట్లు ఖర్చు అవుతుందనుకున్న భవనాన్ని రూ.మూడున్నర కోట్లలోనే పూర్తి చేశాం. ప్రభుత్వ లెక్కలకు జవాబుదారీగా శాసన వ్యవస్థ ఉంటుంది. ఒక్క రూపాయి కూడా దుబారా చేయకూడదనే మా లక్ష్యానికి ఈ భవన నిర్మాణంతోనే పునాది వేశాం' అని మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook