)
AP Heavy Rains: మొంథా తుఫాను తీవ్ర రూపం దాల్చడంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు రాగా.. ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ కోలుకుంటోంది. ఈ క్రమంలోనే మళ్లీ ఏపీకి భారీ వర్ష ముప్పు పొంచి ఉంది. శ్రీలంక సమీపాన నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో దాని ప్రభావంతో భారీ వర్షాలు రానున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీలంక సమీపాన నైరుతి బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి తమిళనాడు వైపు వెళ్లనుంది. దీని ప్రభావంతో బంగాళాఖాతం నుంచి తూర్పుగాలులు తమిళనాడు, దానికి ఆనుకుని దక్షిణ కోస్తా, రాయలసీమ వైపు వీస్తున్నాయి. ఆదివారం దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలపడంతో ఆ మేరకు అక్కడ వర్షాలు పడ్డాయి.
నేడు ఎక్కడ అంటే..?
అల్పపీడనం ప్రభావంతో సోమవారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. రేపు అంటే మంగళవారం 18వ తేదీన నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం కొనసాగుతుందని పేర్కొనడం విశేషం.
వాయువ్య భారతం నుంచి గాలులు కోస్తా, రాయలసీమ వరకు వీస్తుండడంతో శనివారం చలి పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఆరు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. రానున్న రెండు రోజుల్లో చలిగాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, అల్పపీడనం రాగల 24గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా నెమ్మదిగా కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే, ఈనెల 21న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో ఈనెల 24-27 తేదీల మధ్య కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి