CLAP Programme: ఉద్యోగులకు సక్రమంగా జీతాలు చెల్లిస్తున్నామని చెబుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉద్యోగులు భారీ షాక్ ఇచ్చారు. తమ బకాయి వేతనాల కోసం ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. దీనికితోడు పీఎఫ్, ఈఎస్‌ఐకు సంబంధించిన వాటిని కూడా చెల్లించాలని నిరసనకు దిగారు. అంతేకాకుండా వాహనాలకు గ్యాస్, డీజిల్, పెట్రోల్ నింపాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టారు. వారి ఆందోళనతో ఏపీలో చర్చనీయాంశంగా మారింది.
Also Read: KA Paul: 'నా ఆస్తులు కొట్టేయాలని కుట్ర'.. చంద్రబాబు, పవన్‌పై కేఏ పాల్ సంచలన ఆరోపణలు
కాకినాడ నగర పాలక సంస్థ పరిధిలో తడి, పొడి చెత్తను క్లాప్ వాహనాలు సేకరిస్తాయి. మార్చి 1వ తేదీ నుంచి గ్యాస్, పెట్రోల్ వేయించకపోవడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వాహనాలు నిలిచిపోవడంతో డ్రైవర్‌కు ఉపాధి లేకుండా పోవడంతో వారికి జీతాలు ఇవ్వడం లేదు. దీంతో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. తక్షణమే వాహనాలకు ఇంధనం సమకూర్చి వాటిని నడిపించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడలోని జగన్నాథపురం వాహనాల యార్డ్ వద్ద డ్రైవర్లు నిరసన చేపట్టారు.
Also Read: Chandrababu Naidu: కలల ప్రాజెక్టు 'స్వర్ణాంధ్ర విజన్ - 2047' సాధనకు కుప్పం, పిఠాపురం ఎంపిక
సీఐటీయూ నాయకుడు పలివెల వీరబాబు మాట్లాడుతూ.. కాకినాడలో క్లాప్ వాహనాలు చెత్త సేకరణలో కీలకంగా మారాయని.. కూటమి ప్రభుత్వం వచ్చాక క్లాప్ వ్యవస్థ కొనసాగుతుందా? అని సందేహం వ్యక్తం చేశారు. డ్రైవర్స్ ఉపాధి భద్రత విషయంలో ఆందోళన చెందుతున్నారని తెలిపారు. కాకినాడ నగర పాలక సంస్థ రూ.30 లక్షలు పంపించినా కాంట్రాక్టు సంస్థకు జమ కాలేదని చెబుతున్నారని వివరించారు.
మున్సిపల్ ఉన్నతాధికారులు స్పందించి క్లాప్ వాహనాలు నడిపించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. డ్రైవర్లకు 3 నెలల బకాయి జీతాలు చెల్లించాలని, 2024 జనవరి నుంచి డ్రైవర్స్ జీతాలు మినహాయించిన పీఎఫ్, ఈఎస్ఐ వారి ఖాతాలకు జమ చేయాలని క్లాప్ వాహనాల డ్రైవర్లు కోరారు. వారాంతపు సెలవులు, క్యాజువల్ లీవులు అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ జీఓ ప్రకారం క్లాప్ వాహన డ్రైవర్స్‌కి రూ.24,500 కనీస వేతనం అమలు చేయాలని కోరుతున్నట్లు చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook









