ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల; బాలికలదే పై చేయి

ఏపీలో టెన్త్ క్లాస్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.

Updated: May 14, 2019, 11:46 AM IST
ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల; బాలికలదే పై చేయి

ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ రోజు ఉదయం 11 గంటలకు విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఫలితాలను విడుదల చేశారు. ఈ సారి పరీక్ష రాసిన వారిలో  94.88 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలికలు 95.09 శాతం ఉత్తీర్ణత సాధించగా  94.68 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారు. ఈ సారి ఫలితాల్లోనూ బాలికలే పై చేయి సాధించడం గమనార్హం.

ఈ సందర్భంగా విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి మాట్లాడుతూ ఈ సారి 5,464 సూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత సాధించగా..3 స్కూళ్లలో జీరో శాతం ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు. అలాగే 98.19 శాతం ఉత్తీర్ణత సాధించి తూర్పుగోదావరి జిల్లా మొదటి స్థానంలో నిలవగా...83.19 శాతం ఉత్తీర్ణతతో నెల్లూరు చివరి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. జూన్ 17 నుంచి 29 వరకు అడ్వన్స్‌‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంప్లిమెంటరీ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్ధులు జూన్ 7 లోపు పరీక్ష ఫీజు చెల్లించాలని సంధ్యారాణి కోరారు.

ముఖ్యాంశాలు:

ఫలితాల్లో బాలికలదే పై చేయి
టాప్ వన్ స్థానంలో తూ.గో జిల్లా  (98.19 శాతం ఉత్తీర్ణత )
చివరి స్థానంలో నెల్లూరు జిల్లా  (83.19 శాతం ఉత్తీర్ణత )
5,464 సూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత
3 స్కూళ్లలో జీరో శాతం ఉత్తీర్ణత
జూన్ 17 నుంచి 29 వరకు అడ్వన్స్‌‌డ్ సప్లిమెంటరీ
జూన్ 7  పరీక్ష ఫీజు గడువు విధింపు