10th Exams Rules Regulations: ఆంధ్ర ప్రదేశ్ లో 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. దీని కోసం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6 లక్షల 49 వేల 884 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో రెగ్యులర్ అభ్యర్థులు 6 లక్షల 19 వేల 275 మంది. సామాన్యశాస్త్రం పరీక్షలు మినహా మిగతావి ఉదయం 9.30 గంటల నుంచి 12.45 వరకు జరగనున్నాయి.
విద్యార్థులు ప్రశ్నపత్రం చదువుకునేందుకు అదనంగా 15 నిమిషాలు కేటాయించారు. ఈసారి రెగ్యులర్ విద్యార్థులతో పాటే సార్వత్రిక విద్యాపీఠం అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణ సదుపాయం కల్పించినట్లు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.పరీక్ష కేంద్రాలకు 100 మీటర్ల వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. విద్యార్ధులు ఎలాంటి క్యాలికులేటర్లు, ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ వెంట తీసుకెళ్లకూడదనే నిబంధనలు ఉన్నాయి.
ఏపీ వ్యాప్తంగా మొత్తం 3450 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 144 విధించారు. ఈ పరీక్షల్లో ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ పరీక్షలు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి ఉదయం 11.30 గంటల వరకు జరుగుతాయి. విద్యాశాఖతో పాటు, హోం శాఖ పరీక్షల నిర్వహణ బాధ్యతలను తీసుకున్నారు. మార్చ్ 31 రంజాన్ ఉంటే ఏప్రిల్ 1న లాస్ట్ ఎగ్జామ్ సాంఘీక శాస్త్రం ఉంటుంది. ఒకవేళ ఏప్రిల్ 1 పండుగైతే మాత్రం మార్చ్ 31నే సోషల్ స్డడీస్ ఎగ్జామ్ పూర్తవుతుంది.
ఇదీ చదవండి: టబుకు అన్న ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా.. ! అస్సలు ఎక్స్ పెక్ట్ చేయరు..
ఇదీ చదవండి: నిహారిక మళ్లీ పెళ్లి కూతురు అవుతుందోచ్.. పెళ్లి కొడుకు ఫిక్స్..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









