close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్;  కొన్ని గంటల్లో ఉత్కంఠతకు తెర

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సారి అధికారం ఎవరిది ? మళ్లీ చంద్రబాబు అధికార పగ్గాలు కైవసం చేసుకుంటారా ? చంద్రబాబు స్థానంలో జగన్‌కు ఓటర్లు పట్టంకట్టనున్నారా ? మరి కొన్ని గంటల్లో ఈ ఉత్కంతకు తెరపడునుంది. 

Updated: May 23, 2019, 08:29 AM IST
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్;  కొన్ని గంటల్లో ఉత్కంఠతకు తెర

తొలి విడత ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. దీనికి సంబంధించిన కౌంటింగ్ ప్రారంభమైంది. ఈ ప్రక్రియ పూర్తి చేసుకొని మరికొన్ని గంటల్లో ఫలితాలు వెలువరించనున్నారు. దీంతో  ఫలితాలపై ఇటు అభ్యర్థులు, అటు జనాల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

కౌంటింగ్ షెడ్యూల్....
ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియలో తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తారు. మధ్యాహ్నం 2 గంటల వరకు ఈవీఎంల ఓట్ల లెక్కింపు పూర్తయ్యే అవకాశముందని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. అంటే మధ్యాహ్నం కల్లా గెలుపు ఎవరిదనే విషయంపై క్లారిటీ రానుంది. 

అయితే రాజకీయ పార్టీలు ఈవీఎంల విషయంలో అభ్యంతాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈవీఎంల ఓట్ల లెక్కింపు  అనంతరం ప్రతి నియెజకవర్గంలో 5 ఈవీఎంలకు సంబంధించిన వీవీప్యాట్ స్లిప్పులను లెక్కిస్తారు. ఇలా ఈ ప్రక్రియ పూర్తి చేసి సాయంత్రానికి కల్లా అధికారికంగా ఫలితాలు వెలవడించనున్నారు.