AP BJP: ఏపీ బీజేపీలో అసలు సిసలు కార్యకర్తకు దక్కిన గౌరవం.. పాకా సత్యనారాయణకు రాజ్యసభ సీటు..

AP BJP: ఏపీలో వైసీపీ అభ్యర్ధిగా విజయసాయి రెడ్డి ఖాళీ చేసిన రాజ్యసీటు ఎవరికి ఇవ్వాలనే దానిపై కూటమి నేతల మధ్య తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ సీటును తమిళనాడు మాజీ బీజేపీ ఛీప్ మాజీ ఐపీఎస్  అన్నామలైకు ఇస్తారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత మంద కృష్ణ పేరు వినిపించింది. కానీ అనూహ్యంగా  పార్టీని నమ్ముకున్న కార్యకర్త పాకా సత్యనారాయణను రాజ్యసభకు ఎంపిక చేసి అందరిని ఆశ్యర్యచకితులను చేసింది.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 29, 2025, 06:55 AM IST
AP BJP: ఏపీ బీజేపీలో అసలు సిసలు కార్యకర్తకు దక్కిన గౌరవం.. పాకా సత్యనారాయణకు రాజ్యసభ సీటు..

AP BJP: ప్రస్తుతం ఏపీ భారతీయ జనతా పార్టీలో అసలు కంటే కొసరుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే మాట గత కొన్నేళ్లుగా వినిపిస్తూ వస్తోంది. ముఖ్యంగా పారాష్యూట్ నాయకులకే ఎక్కువ టికెట్స్ ఇచ్చి అసలు సిసలు కార్యకర్తలను పక్కన పెట్టారనే విమర్శ వచ్చింది. అప్పట్లో కన్నా లక్ష్మీ నారాయణ, ప్రస్తుతం పురంధేశ్వరిలు వేరే పార్టీల నుంచి వచ్చిన వారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. గత ఎన్నికల్లో ఆరు లోక్ సభ సీట్లలో ఐదు సీట్లను ప్యారాష్యూట్ బ్యాచ్ కే ఇచ్చింది. ఇక నర్సాపురం టికెట్ విషయంలో మాత్రం బీజేపీ ఎప్పటి నుంచో నమ్మకొని ఉన్న భూపతిరాజు శ్రీనివాస వర్మకు టికెట్ ఇచ్చింది.

Add Zee News as a Preferred Source

ఆయన నర్సాపురం నుంచి ఎంపీగా గెలిచారు. అంతేకాదు నరేంద్ర మోడీ క్యాబినేట్ లో సహాయ మంత్రి పదవి ఇచ్చి గౌరవించి అసలు సిసలు బీజేపీ కార్యకర్తను తాము ఎన్నటికీ మరువము అన్న సంగతి క్యాడర్ లో తీసుకెళ్లగలిగారు. గత ఎన్నికల సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన సోము వీర్రాజును తాజాగా ఎమ్మెల్సీ చేసి ఆయనకు తగిన గౌరవం ఇచ్చింది.

అదే సమయంలో ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ పార్టీని మొదటి నుంచి నమ్ముకొని ఉన్న పాక వెంకటసత్య నారాయణను అనూహ్యంగ రాజ్యసభకు ఎంపిక చేసి అందరినీ ఆశ్యర్య చకితులను చేసింది. బీజేపీలో ఓ సామాన్య కార్యకర్తకు దక్కిన గౌరవంగా అందరు భావిస్తున్నారు. ఈ మేరకు అధికారికంగా వెంకటసత్య నారాయణ పేరును బీజేపీ అధిష్టానం వెల్లడించింది. విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభ సీటు ఖాళీ అయింది. ఈ స్థానంలో పాక వెంకటసత్య నారాయణపేరు ఖరారు చేశారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల గడువు ముగియనుంది.ఈ  నేపథ్యంలో ఆయన పేరును ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఏపీలోని బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.

ఇదీ చదవండి: భర్తపై ప్రతీకారంతో వివాహేతర సంబంధం పెట్టుకున్న స్టార్ హీరోయిన్.. ఈ రేంజ్ కాంట్రవర్షల్ నటి మరొకరు లేరేమో..

ఇదీ చదవండి:  కమల్ హాసన్, వాణి గణపతి ఎందుకు విడిపోయారు.. విడాకుల సందర్భంగా ఇచ్చిన భరణం ఎంతో తెలుసా.. !

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News