AP Budget 2025-26: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తీపి కబురు అందించింది. నేడు ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ ప్రసంగంలో మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో మరో కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు శుభవార్త చెప్పారు. ఏపీ బడ్జెట్ నేడు పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో ప్రజల ఆరోగ్యానికి పెద్ద పీట వేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో మరో కొత్త పథకాన్ని పరిచయం చేశారు. ఇది పేద, మధ్యతరగతి కుటుంబాలకు భారీ లబ్ది చేకూరే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సదుపాయం అందించడానికి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో రూ.25 లక్షల ఆరోగ్య బీమా పథకం అమలులోకి తీసుకురానుందని ఆర్థిక మంత్రి కీలక ప్రకటన చేశారు. దీంతో మధ్యతరగతి, పేద ప్రజలకు ఎలాంటి ఖర్చు లేకుండానే కార్పొరేట్ వైద్యం పొందవచ్చని వివరించారు.
ఇక రూ.48,340 కోట్లతో అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం లాభదాయకంగా ఉంటేనే, రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఇక వ్యవసాయ రంగంలో 15% మా టార్గెట్ .. కౌలు చట్టం కూడా అమల్లోకి తీసుకువస్తామని చెప్పారు. ఈ బడ్జెట్‌లో బీసీ సంక్షేమానికి రూ. 47,456 కోట్లు, విద్యాశాఖ రూ.31,805 కోట్లు, ఎస్సీ సంక్షేమం రూ.20,281 కోట్లు, ఎస్టీ సంక్షేమం రూ.8,159 కోట్లు, వ్యవసాయ అనుబంధ సంఘాలకు రూ.13,487 కోట్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ స్కాలర్షిప్ రూ.3377 కోట్లు, ఒంటరి మహిళ, దివ్యాంగులు, వృద్ధులకు రూ.4,332 కోట్లు కేటాయించారు.
ఇదీ చదవండి: పుణే రేప్ కేసు నిందితుడి అరెస్ట్.. బస్సులో వందల కండోమ్స్, మహిళల లోదుస్తులు..
ఇక తల్లికి వందనంపై ఆర్థిక శాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. ఈ పథకం అమలుకు రూ.9,407 కోట్లు కేటాయించినట్లు పయ్యావుల కేశవ్ తెలిపారు. ఈ పథకంలో ప్రతి విద్యార్థి తల్లికి రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాల్లో చదివే ఒకటవ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఈ పథకం అమలు అవుతుందన్నారు. ఇంకా పాఠశాలల అన్నిటికీ ఉచిత విద్యుత్ కూడా అందజేస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: విద్యార్థులకు గుడ్ న్యూస్.. మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు..
ఇదిలా ఉండగా పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ..సీఎం చంద్రబాబు ఆర్థిక సవాళ్లు అధిగమించడంలో దిట్టా అని కొనియాడారు. గత ప్రభుత్వం కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైందని జీతాలు సరిగా చెల్లించలేని పరిస్థితిలో ఉండేది. దీన్ని ఎలా అధిగమించాలో బాబుకు మాత్రమే తెలుసు అని ఆయన ప్రశంసించారు. అంతేకాదు పోలవరం ప్రాజెక్టు పనులు కూడా 70 శాతానికి పైగా పూర్తయ్యాయని.. 2027 నాటికి దాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. 2 వేల టీఎంసీల గోదావరి నీరు సముద్రం పాలవుతున్నాయి.. వీటిని రాయలసీమకు మళ్ళి ఇస్తామని ఇందుకోసం సీఎం చంద్రబాబు పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారన్నారు. అలాగే హంద్రీనీవా కాలువ వెడల్పు పనులతోపాటు వెలిగొండ, చింతలపూడి, వంశధార పనులు కూడా వివిధ దశల్లో కొనసాగుతున్నాయని వివరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









