Cabinet Decisions: తాను శంకుస్థాపన చేసిన రాజధాని అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు పూర్తి దృష్టి సారించారు. మంత్రివర్గ సమావేశంలోనూ అమరావతి అభివృద్ధిపై కీలకంగా చర్చించారు. మే 2వ తేదీన అమరావతిలో అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ మేరకు ప్రధాని పర్యటనతోపాటు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలపై మంత్రివర్గ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. అసెంబ్లీ, హైకోర్టు భవన నిర్మాణాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Also Read: Revanth Reddy: రేవంత్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం.. లిఫ్ట్‌లో ఇరుక్కున్న సీఎం
అమరావతిలోని సచివాలయంలో మంగళవారం మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టాల్సిన పనులు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుపై కీలక చర్చ జరిగింది. కొత్త ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలతోపాటు ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్, మున్సిపాలిటీ, విశాఖపట్టణంలో చేపట్టాల్సిన పనులపై మంత్రివర్గంలో చర్చించారు.
Also Read: Bhu Bharathi: ధరణిని బంగాళాఖాతంలో కలిపి 'భూ భారతి'ని తీసుకువచ్చాం
రాజకీయ పరిణామాలపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగింది. టీటీడీ గోశాల, వక్ఫ్ చట్టం, పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతిపై మంత్రివర్గంలో సీఎం చంద్రబాబు చర్చించారు. ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజలను రెచ్చగొట్టేప్రచారం చేసిందని సీఎం చంద్రబాబు సమావేశంలో తెలిపారు. మతపరమైన అంశాల్లో ప్రతిపక్షం ఆరోపణలను మంత్రులు ధీటుగా ఎదుర్కోలేకపోతున్నారని క్లాస్ తీసుకున్నారని సమాచారం. ఇలాంటి అంశాలపై మంత్రులు వెంటనే స్పందించాలని సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది.
మంత్రివర్గ నిర్ణయాలు ఇవే..
- ఆంధ్రప్రదేశ్‌లో 2,260 స్పెషల్ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుల మంజూరుకు మంత్రివర్గం పచ్చజెండా. సుప్రీంకోర్టు ఉత్తర్వులతో ఎస్జీటీలు 1,136, స్కూల్ అసిస్టెంట్స్ 1,124 భర్తీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం
- ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్‌కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం.
- రూ.617 కోట్లతో అసెంబ్లీ, రూ.786 కోట్లతో హైకోర్టు భవన నిర్మాణాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నిర్మాణ పనులను ఎల్1 బిడ్డర్‌కు అప్పగించాలని నిర్ణయం.
- స్టేట్ సెంటర్ ఫర్ క్లైమెట్ ఇన్ సిటీస్ వ్యవస్థల ఏర్పాటుకు ఆమోదించింది.
- పట్టణ ప్రాంతాల్లో వరద నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
- విశాఖలోని ఐటీహిల్ -3 పైన టీసీఎస్కీ 21.66 ఎకరాలు, ఉరుస క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 3.5 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం
- ఉరుస క్లస్టర్‌కు కాపులుప్పాడలో 56 ఎకరాల భూమి కేటాయింపునకు ఆమోదం.
- బలిమెల, జోలాపుట్ రిజర్వాయర్ల వద్ద చేపట్టాల్సిన హైడల్ ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణాలపై ఒడిశా పవర్ కన్సార్టియమ్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం
- 30 మెగావాట్ల సామర్థ్యంతో 2 హైడల్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది
- వివిధ ప్రాంతాల్లో పవన విద్యుత్, సౌర విద్యుత్ ప్లాట్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









