Meenakshi Chaudhary: ఏపీకి బ్రాండ్ అంబాసిడర్‌గా హీరోయిన్ మీనాక్షి చౌదరి..?.. వార్తలలో అసలు నిజమేంటంటే..?

Ap Govt: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఏపీకి బ్రాండ్ అంబాసిడర్ గా హీరోయిన్ మీనాక్షి చౌదరిని ఎంపికి చేసినట్లు అనేక వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో దీనిపై ప్రభుత్వం స్పందించింది.  

Written by - Inamdar Paresh | Last Updated : Mar 2, 2025, 01:32 PM IST
  • క్లారిటీ ఇచ్చిన ఏపీ అధికారులు..
  • ఫీల్ అయిన అభిమానులు..
Meenakshi Chaudhary: ఏపీకి బ్రాండ్ అంబాసిడర్‌గా హీరోయిన్ మీనాక్షి చౌదరి..?.. వార్తలలో అసలు నిజమేంటంటే..?

Meenakshi Chaudhary latest news: ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి సర్కారు ప్రజలకు మెరుగైన పాలన అందిస్తు ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఏపీలో మహిళల పట్ల ఎవరు  అమర్యాదగ ప్రవర్తించిన, సోషల్ మీడియాలో వేధించిన  కూడా ప్రభుత్వం సీరియస్ గా చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా.. ఏపీ ప్రభుత్వం సంక్రాంతికి వస్తున్నాం మూవీ హీరోయిన్ మీనాక్షి చౌదరిని ఏపీ ఉమెన్ ఎంపవ‌ర్‌మెంట్‌ బ్రాండ్ అంబాసిడర్‌ గా నియమించినట్లు అనేక మీడియాలో కథనాలు వచ్చాయి.

Add Zee News as a Preferred Source

సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై ప్రస్తుతం ఏపీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. హీరోయిన్ మీనాక్షి చౌదరిని ఏపీ ఉమెన్ ఎంపవ‌ర్‌మెంట్‌ బ్రాండ్ గా నియమించామన్న వార్తల్లో నిజంలేదని కొట్టిపారేశారు. అయితే.. ఏపీ ప్రభుత్వం మొదట మహిళా సాధికారతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఒక నటిని నియమించాలని భావించిన మాట వాస్తవమే కాని.. కానీ ఇప్పుడు ఆ ప్రణాళిక నుండి వెనక్కి తగ్గిందని అధికారులు స్పష్టం చేశారు. 

మరోవైపు  మీనాక్షి చౌదరి ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన "సంక్రాంతికి వస్తున్నాం" మూవీలో నటించి ఒక రేంజ్ లో అభిమానుల్ని సొంతం చేసుకున్నారు.  ఈ సినిమాకు బాక్సాఫీస్ మీద కాసులవర్షం కురిశాయని చెప్పుకొవచ్చు.

Read more: Alia Bhatt: షాకింగ్ నిర్ణయం తీసుకున్న ఆలియా భట్.. ఆ హీరో వల్లే కూతురి ఫోటోలు డిలీట్..?..

ఏకంగా సినిమా రూ. 300 కోట్ల వసూళ్లను రాబట్టింది. గతేడాది నటి.. మహేశ్ బాబుతో గుంటూరు కారం, దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ సినిమాలోనూ నటించి మెప్పించారు. ప్రస్తుతం.. మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభ‌రలో  నటిస్తు బిజీగా ఉన్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News