Babu Delhi Tour: ఢిల్లీలో టూర్ లో చంద్రబాబు .. రాజ్యసభ సీటు భర్తీపై చర్చ..

Babu Delhi Tour: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు ఢిల్లీ టూర్ లో బిజీగా ఉన్నారు. విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఈ సీటు భర్తీ విషయంలో బీజేపీ అధిష్ఠానంతో చర్చించడానికి చంద్రబాబు ఢిల్లీలో బిజీగా గడపనున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 22, 2025, 08:48 AM IST
Babu Delhi Tour: ఢిల్లీలో టూర్ లో చంద్రబాబు .. రాజ్యసభ సీటు భర్తీపై చర్చ..

Babu Delhi Tour: ఆంధ్ర ప్రదేశ్ లో  రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. కూటమి పార్టీలుగా కొనసాగుతూనే సొంతంగా బలం పెంచుకోవటమే లక్ష్యంగా మూడు పార్టీలు వ్యూహాలు అమలు చేస్తున్నాయి. సీఎం చంద్రబాబు యూరప్ నుంచి తిరుగు ప్రయాణమై నిన్న సాయంత్రం దేశ రాజధాని హస్తినకు  చేరుకున్నారు. ఇవాళ  పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.

Add Zee News as a Preferred Source

ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు, జలవనరుల శాఖ మంత్రి, న్యాయశాఖ మంత్రితో ఏపీ సీఎం భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, ప్రాజెక్టుపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారని తెలుస్తోంది.  అయితే, అమిత్ షా తో భేటీ వేళ రాజకీయ చర్చకు కీలకంగా మారనున్నాయి.

కేంద్రంలో త్వరలో మంత్రివర్గ విస్తరణ దిశగా కసరత్తు జరుగుతోందిని తెలుస్తోంది.  దీనికి ముందే ఏపీ నుంచి రాజ్యసభకు వైసీపీ మాజీ నేత విజయ సాయిరెడ్డి స్థానంలో బీజేపీ ఈ సీటు తీసుకోవాలని నిర్ణయించింది. తమ పార్టీ అభ్యర్ధి గురించి చంద్రబాబుకు షా స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. రాజ్యసభకు విజయ సాయిరెడ్డి స్థానంలో తమిళనాడు బీజేపీ నేత అన్నామలైకు అవకాశం ఇస్తారని ఢిల్లీ బీజేపీ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

అన్నామలై ను ఏపీ నుంచి రాజ్యసభకు నామినేట్ చేసి కేంద్ర మంత్రిగా అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ఇప్పుడు చంద్రబాబు పర్యటన వేళ ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్ధితో పాటు  కేంద్ర మంత్రిగా అవకాశం ఎవరికి ఇవ్వాలని అంశం పైన చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. మరోవైపు మంత్రివర్గ విస్తరణలో తెలుగు దేశం పార్టీకి మరో క్యాబినేట్ మంత్రి పదవి విషయమై చర్చించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: బడా స్టార్స్ సహా 900 సినిమాల్లో నటించిన నటి.. భర్త చనిపోవడంతో తాగుడుకు బానిసై జీవితం నాశనం..

ఇదీ చదవండి:  ఈ చెట్లు ఉంటే.. పాములకు మీ ఇంట్లోకి రెడ్ కార్పెట్ పరిచినట్టే.. తస్మాత్ జాగ్రత్త..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News