close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

కేసీఆర్ పరిపాలనపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు

కేసీఆర్ పరిపాలనపై చంద్రబాబు కామెంట్స్

Updated: Nov 15, 2018, 12:20 PM IST
కేసీఆర్ పరిపాలనపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు

అమరావతి: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పరిపాలనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరోక్ష విమర్శలు చేశారు. హైదరాబాద్ నగరం బంగారు గుడ్లు పెట్టే బాతు లాంటిది. అటువంటి హైదరాబాద్ ఎలా సద్వినియోగం చేసుకోవాలో కొంతమందికి తెలియదని అన్నారు. ఈ క్రమంలోనే పరోక్షంగా కేసీఆర్ పరిపాలన తీరు సరిగా లేదని చంద్రబాబు ఆరోపించారు. బుధవారం రాష్ట్ర రాజధాని అమరావతిలో పర్యటిస్తూ అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్ పరిపాలనపై విమర్శనాస్త్రాలు సంధించారు. 

హైదరాబాద్‌కు గుర్తింపు తీసుకొచ్చింది తానే అయినప్పటికీ.. ఎందుకో ఆ విషయాన్ని చెబితే కేసీఆర్‌కు నచ్చదని అన్నారు. హైదరాబాద్‌ గురించి తాను ఎప్పుడు మాట్లాడినా.. కేసీఆర్ వెంటనే తనపై ఎదురుదాడికి దిగుతుంటారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఎన్నికల వాతావరణం వేడెక్కిన ప్రస్తుత తరుణంలో చంద్రబాబు చేసిన ఈ విమర్శలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఏమని స్పందిస్తారో వేచిచూడాల్సిందే మరి!