ఏపీకి రానున్న ప్రధాని మోదీ.. స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు

ఆ రెండు పార్టీలు బీజేపీతో కుమ్మక్కయ్యాయి : ఏపీ సీఎం చంద్రబాబు

Last Updated : Dec 23, 2018, 08:10 PM IST
ఏపీకి రానున్న ప్రధాని మోదీ.. స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కి తీవ్ర అన్యాయం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని రాష్ట్రానికి వస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. మనం బతికామా.. చచ్చమా అని చూసేందుకు ప్రధాని వస్తున్నారా అని అసహనం వ్యక్తంచేశారు. బీజేపీతో పాటు ఆపార్టీకి సహకరిస్తున్న ఇతర పార్టీలకు ప్రజలే వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూనే స్వశక్తితో అభివృద్ధి సాధిస్తున్నాం కానీ కేంద్రం నుంచి ఏ సాయం అందలేదని ఈ సందర్భంగా కేంద్రంపైచంద్రబాబు విమర్శలు గుప్పించారు. 

ఈ సందర్భంగా ఏపీలోని ప్రతిపక్షమైన వైఎస్సార్సీపీ, ఏపీ సర్కార్‌పై వ్యతిరేక ప్రచారం చేస్తోన్న జనసేన పార్టీలపై సైతం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓవైపు రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను కేంద్రంతో పోరాడుతోంటే, మరోవైపు అదే కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీతో వైఎస్సార్సీపీ, జనసేన పార్టీలు కుమ్మక్కయ్యాయని చంద్రబాబు ఆరోపించారు. అది కరెక్ట్ కాదని నిలదీసినందుకు  రాయలసీమ, ఉత్తరాంధ్రలో డిక్లరేషన్ల పేరుతో చిచ్చుపెట్టి తనను ఇబ్బందులు పెట్టాలని చూశారు అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రత్యేక హోదాకు మద్దతివ్వని టీఆర్ఎస్‌కు తెలంగాణ ఎన్నికల సమయంలో ఏపీలోని విపక్షాలు సహకరించాయని, వారిని ప్రజలే నిలదీయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Trending News