chandrababu naidu review meeting with officials: కొన్నిరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నారు. ఉదయం 9 అయ్యిందంటే చాలు.. భానుడు తన భగ భగలతో జనాలకు చుక్కలు చూపిస్తున్నాడు. అంతే కాకుండా.. అసలు బైటకు వెళ్లాలంటేనే జనాలు భయపడిపోతున్నారు. అత్యవసరం అయితేనే బైటకు వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల ప్రజలు వడదెబ్బ ప్రభావానికి సైతం గురౌతున్నారు.
ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి ఈరోజు సమ్మర్ లో తీసుకొవాల్సిన చర్యలపై వివిధ శాఖలకు చెందిన అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎండల వేళ ముందు జాగ్రత్తలు పాటించాలన్నారు. ముఖ్యంగా.. ఉపాధి హమీ పథకంలో పని చేసే వర్కర్ లు.. ఉదయం 6 గంటల నుంచి 11 లోపు తమ పనులు పూర్తయ్యేలా చూసుకొవాలన్నారు. మున్సిపల్ సిబ్బందికి.. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 వరకు ఎలాంటి పనులు చేయోద్దని సూచించారు.
అంతకు ముందు.. లేదా.. ఎండ తగ్గినాక పనులు చేసేలా చర్యలు తీసుకొవాలన్నారు. ముఖ్యంగా స్కూళ్లలో విద్యార్థులకు వాటర్ బెల్ ను ఇంప్టీమెంట్ చేయాలన్నారు. చాలా మందికి దాహం వేసిన కూడా నీళ్లు తాగరు. అలాంటి క్రమంలో.. తప్పకుండా.. వాటర్ బెల్ ను ఏర్పాటు చేసి.. మరీ విద్యార్థులు నీళ్లు తాగేలా చూడాలన్నారు. ఎక్కడికక్కడ కూడా మజ్జీగలు పంపిణిచేయాలన్నారు. అదే విధంగా చలివేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. అడవుల్లో కార్చిచ్చుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఎక్కడ కూడా ప్రజలు తాగునీటి కోసం బిందెలు పట్టుకుని రోడ్ల మీదకు వచ్చే పరిస్థితులు రాకూడదన్నారు. మున్సిపాల్ లో సమస్యల పరిష్కారానికి రూ. 39 కోట్లను విడుదల చేస్తామన్నారు. నిరంతరం అధికారులు అప్రమత్తంగా ఉంటూ.. సమ్మర్ లో ప్రజలకు ఎప్పటికప్పుడు ఎండల నుంచి బైటపడేలా సూచనలు, సలహలు ఇవ్వాలన్నారు. గ్రౌండ్ లెవల్ ప్రజలకు కావాల్సిన సదుపాయాల్ని దగ్గరుండీ చూసుకొవాలన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter









