Chandrababu naidu: వాళ్ల కదే చివరి రోజు..!.. సోషల్ మీడియా ట్రోలర్స్‌కు మాస్ వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు..

Ap cm Chandrababu naidu serious on trollers:  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్రోలర్స్ కు బిగ్ షాక్ ఇచ్చారు.ఇక మీదట మహిళల్ని సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు పాల్పడితే అదే వాళ్లకు చివరి రోజు అవుతుందని మాస్ వార్నింగ్ ఇచ్చారు. మహిళల దిక్కు చూడాలంటేనే భయాపడేలా చేస్తామని హెచ్చరించారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 11, 2025, 06:47 PM IST
  • ట్రోలర్స్ పై సీరియస్ అయిన ఏపీ సీఎం..
  • ఇక కఠిన చర్యలంటూ వార్నింగ్..
Chandrababu naidu: వాళ్ల కదే చివరి రోజు..!.. సోషల్ మీడియా ట్రోలర్స్‌కు మాస్ వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు..

Chandrababu naidu serious on social media trollers: ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా ట్రోలర్స్ పై సీరియస్ అయ్యింది. ఇటీవల టీడీపీకి చెందిన కార్యకర్త చేబ్రోలు కిరణ్ మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతీపై కాంట్రవర్సీగా మాట్లాడారు. దీనిపై ఏపీ పోలీసులు సీరియస్ అయ్యారు . వెంటనే చేబ్రోల్ కిరణ్ ను అదుపులోకి తీసుకున్నారు. అంతే కాకుండా.. పార్టీలకతీతంగా ఎవరు మహిళల్ని కించపర్చే విధంగా పోస్ట్ లు పెట్టిన కూడా వదిలేది లేదని ఏపీ  పోలీసులు స్పష్టం చేశారు.

Add Zee News as a Preferred Source

ఈ నేపథ్యంలో ప్రస్తుతం సోషల్ మీడియా ట్రోలింగ్ పై  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో కూటమి సర్కారు.. బీసీల కోసం పెద్ద పీట వేస్తుందన్నారు. ప్రజల కోసం ఎన్నికలలో ఇచ్చిన హమీలను నెరవేర్చే విధంగా ముందుకుపోతున్నట్లు చెప్పారు. ఈ  క్రమంలో ట్రోలింగ్ అంశంపై మాట్లాడారు. చేబ్రోలు కిరణ్ వ్వవహరంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు.

ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం, పోలీసులు ఉక్కుపాతం మోపుతుందన్నారు.మహిళల్ని అగౌరవపరిస్తే ఎవరిని వదిలేదిలేదని స్పష్టం చేశారు. అంతే కాకుండా.. ఇక మీద ఎవరైన సోషల్ మీడియా లేదా డైరెక్ట్ గా కానీ... మహిళల్ని వ్యక్తిత్వ హననంకు పాల్పడితే.. వాళ్లకు అదే లాస్ట్ డే అవుతుందని కూడా చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు.

Read more: YS Sharmila Tweet: ఈ సైకో గాళ్లను నడి రోడ్డుమీద ఉరితీయాలి..!.. వైఎస్ భారతికి మద్దతుగా రంగంలోకి దిగిన షర్మిల..

అదే విధంగా.. చంద్రబాబు నాయుడు.. ఆగిరిపల్లి మండలం వడ్లమానులో పర్యటించారు. తమ ప్రభుత్వం అన్ని వర్గాల వారిని సమానంగా ఆదుకుంటుందనికూడా మాట్లాడారు. ఎన్నికలలో ఇచ్చిన హమీలను కేంద్రంలో ఉన్న మోదీ సర్కారు సహాకారంతో అన్ని కూడా అమలు చేస్తామని చంద్రబాబు ప్రజలకు భరోసా ఇచ్చారు.

ఇక ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సైతం.. వైఎస్ భారతీకి సపోర్్ట గా ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు.అంతే కాకుండా.. ఇక మీదట ట్రోలింగ్ లకు పాల్పడితే..అలాంటి వారిని నడి రోడ్డు మీద ఉరితీయాలని కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ట్రోలింగ్ లను అసలు స్టార్ట్ చేసింది.. టీడీపీ, వైసీపీ అంటూ తీవ్రస్థాయిలో షర్మిల మండిపడ్డారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

About the Author

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News