
30 Years Since Nara Chandrababu Naidu became Chief Minister: తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడుకు ఉన్న రికార్డు మరో పొలిటికల్ లీడర్ కు లేదు. ఈయన రాజకీయ వైకుంఠపాళిలో పాము నోట్ల పడి జీరో అయ్యారు. ఆ తర్వాత నిచ్చెనల మీద నిచ్చెనలు ఎక్కుతూ హీరోగా ప్రూవ్ చేసుకున్నారు. పడ్డపుడల్లా గోడకు కొట్టిన బంతిలా మళ్లీ పైకి లేస్తూనే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడుకున్న సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం మరో నాయకుడు గతంలో లేరు. ఇక రాబోదు చెప్పొచ్చు. అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు నాయుడుకు మరో అరుదైన రికార్డు ఉంది. ఉమ్మడి ఏపీ సహా విభజిత ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు సీఎంగా.. ప్రతిపక్ష నేతగా ఓ రికార్డు నెలకొల్పారు.
సరిగ్గా 30 యేళ్ల క్రితం తొలిసారి అన్న ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసి.. 1995 సెప్టెంబర్ 1న తొలిసారి ఆంధ్ర ప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసారు. ఈ రకంగా ఆయన తొలిసారి ముఖ్యమంత్రి అయిన ఈ రోజు చంద్రబాబుకు వెరీ వెరీ స్పెషల్ అని చెప్పాలి. 3 దశాబ్దాల క్రితం.. సొంతంగా కాకుండా అన్నగారు చంద్రబాబకు మామగారైన ఎన్టీఆర్ ను పార్టీ నుంచి బహిష్కరించి పార్టీ లాక్కొని ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. పార్టీలో ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి రెండో అధికార కేంద్రంగా మారిందని చెప్పి.. ప్రజాస్వామ్య బద్ధంగా కుటుంబ సభ్యుల సహాకారంతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 2 సార్లు 1995 -2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతేకాదు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 2004-2014 వరకు 10 యేళ్ల సుధీర్ఘ కాలం ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అంతేకాదు ఉమ్మడి ఏపీలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా.. ఎక్కువ రోజులు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు తన పేరిట రికార్డు నెలకొల్పారు. బహుశా ఈ రికార్డును ఎవరు బద్దలు కొట్టలేరు. మొత్తంగా ఉమ్మడి, విభిజిత ఆంధ్ర ప్రదేశ్ లో 15 యేళ్లు ప్రతిపక్ష నేతగా రికార్డు క్రియేట్ చేసారు. ముఖ్యమంత్రిగా దాదాపు పదిహేనున్నర యేళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలిస్తున్నారు.
#30YearsSinceCBNbecameCM
Thirty years ago today, Shri N. Chandrababu Naidu took oath for the first time as Chief Minister, marking the dawn of an era that reimagined Andhra Pradesh’s ambitions and accelerated its rise. From retooling governance with technology to catalyzing… pic.twitter.com/oFgvlvE0nx— Lokesh Nara (@naralokesh) September 1, 2025
అంతేకాదు 1978లో చంద్రగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు చంద్రబాబు. అంతేకాదు అప్పటి టి.అంజయ్య మంత్రివర్గంలో క్యాబినేట్ మంత్రిగా పనిచేసారు. ఆ తర్వాత 1983లో జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్ సునామిలో ఓటమి చెందారు. ఆ తర్వాత 1989 నుంచి 2024 వరకు వరుసగా 8 సార్లు కుప్పం నియోజకవర్గం నుంచి 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు బాబు సొంతం. ఈ రికార్డు ప్రస్తుతం ఏపీ సహా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఏ లీడర్ కు లేదు. మొత్తంగా 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు కూడా చంద్రబాబు నాయుడు సొంతం.
అంతేకాదు 1975లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు 1978లో ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభ్యుడు అయ్యారు. ఇంత సుధీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న నాయకుడు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో ఎవరు లేరు. మరోవైపు 45 యేళ్ల అతిపిన్న వయసులో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు సీఎం అయిన రికార్డు చంద్రబాబు పేరిట ఉంది. అంతేకాదు ప్రస్తుతం 74 అతిపెద్ద వయసులో కూడా సీఎం అయిన రికార్డు కూడా ఆయన పేరిట ఉండటం విశేషం.
అంతేకాదు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు వై.యస్.రాజశేఖర్ రెడ్డి ముందుగా అపోజిషన్ లీడర్ గా ఉన్నారు. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అదే సమయంలో చంద్రబాబాబు నాయుడు ప్రతిపక్షనేతగా ఉన్నారు. అంతేకాదు చంద్రబాబాబు సీఎంగా ఉన్నపుడు వైయస్ తనయుడు వైయస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆ తర్వాత వై.యస్.జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే.. చంద్రబాబు నాయుడు అపోజిషన్ లీడర్ గా ఉన్నారు. ఇలా తండ్రీకుమారులు ఇద్దరు ప్రతిపక్ష నేతలుగా ఉన్నపుడు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు.వాళ్లు సీఎం అయినపుడు చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండటం గమనార్హం. అంతేకాదు 1995 నుంచి ఇప్పటి వరకు గత 30 యేళ్లుగా తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉండటం కూడా ఓ రికార్డు. మొత్తంగా నాల్గోసారి ముఖ్యమంత్రిగా రీసెంట్ గా యేడాది కంప్లీట్ చేసుకున్నారు. చంద్రబాబు 30 యేళ్ల క్రితం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో చంద్రబాబు తనయుడు ఏపీ మంత్రి లోకేష్ సహా టీడీపీ నేతలు చంద్రబాబునాయుడుకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.