మద్యపాన నిషేదం దిశగా జగన్ తొలి అడుగు; అధికారులకు కీలక ఆదేశాలు జారీ

ఎన్నికల మందుకు ఇచ్చిన హామీ మేరకు మద్యంపాన నిషేదం దిశగా ఏపీ సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు

Last Updated : Jun 25, 2019, 12:37 PM IST
మద్యపాన నిషేదం దిశగా జగన్ తొలి అడుగు; అధికారులకు కీలక ఆదేశాలు జారీ

ఏపీలో మద్య నిషేదం దిశగా తొలి అడుగుపడింది. దీనికి సంబంధించి సీఎం జగన్ అధికారులకు  కీలక ఆదేశాలు జారీ చేశారు.  ఉదయం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహిస్తున్న  కాన్ఫరెన్స్ లో సీఎం జగన్ మాట్లాడుతూ అక్టోబర్ 1 నాటికి ఒక్క బెల్ట్ షాప్ కూడా లేకుండా చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా దుకాణాలు, దాబాల్లో మద్యం విక్రయాలకు పాల్పడితే  కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు జాతీయ రహదారుల పక్కన ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం దుకాణాలకు అనుమతులు ఇవ్వరాదని కూడా జగన్ ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గద్దని అధికారులకు సూచించారు. 
కొత్త పాలసీకి ఆదేశాలు జారీ
ఇదిలా ఉండగా ప్రస్తుతం నడుపుతున్న మద్యం షాపుల లైసెన్స్ పరిమితి ముగియగానే మరింత కఠినంగా ఉండేలా కొత్త పాలసీ తీసుకురావాలని ఎక్సైజ్ శాఖకు అదేశించారు. కొత్త పాలసీ తీసుకొచ్చి షాపుల సంఖ్యతో పాటు బార్ అండ్ రెస్టారెంట్ల సంఖ్యను కూడా తగ్గిస్తామని...ఇలా దశల వారీగా మద్యం నిషేదం విధిస్తామని  సీఎం జగన్ స్పష్టం చేశారు. 

హామీ అమలు దిశగా జగన్ అడుగులు
అధికారంలోకి రాగానే రాష్ట్రంలో మద్యంపాన నిషేదం విధిస్తామని జగన్ తన పాదయాత్రలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు దశల వారీగా మద్య నిషేదం చేస్తానని జగన్ ప్రమాణస్వీకారం సమయంలో పేర్కొన్నారు. తొలుత పేదలు,మధ్య తరగతి వారికి అందనంత స్థాయిలో ధరలు పెంచుతామని జగన్ తెలిపారు. ఈ క్రమంలో జగన్ ఈ మేరకు చర్యలు ప్రారంభించారు

Trending News