ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. బారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్ని పరిశీలించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


బంగాళాఖాతం ( Bay of Bengal ) లో ఏర్పడిన వాయుగుండం కారణంగా రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పెద్దఎత్తున నష్టం వాటిల్లింది. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో వరదనీరు ముంచెత్తింది. వేలాది ఎకరాల్లో చేతికి రావల్సిన పంట దెబ్బతింది. భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు, పరిశీలించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏరియల్ సర్వే ( cm jagan aerial survey in flood affected areas ) చేశారు.


ఇప్పటికే  పలుసార్లు అధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించారు. అటు వరద కారణంగా నష్టపోయిన రాష్ట్రానికి సహాయం చేయాలని కేంద్రానికి లేఖ రాశారు. ప్రాధమిక అంచనా ప్రకారం  4 వేల 450 కోట్ల నష్టం వాటిల్లిందని..తక్షణ సహాయంగా 2 వేల 250 కోట్లు విడుదల చేయాల్సిందిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( central minister amit shah ) కు జగన్ విజ్ఞప్తి చేశారు.  


వరద పరిస్థితిని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని కూడా పంపాల్సిందిగా వైఎస్ జగన్ కోరారు.  కరోనా వైరస్ కారణంగా ఆర్ధికంగా దెబ్బతిన్న  రాష్ట్రం ..వరదల కారణంగా మరింతగా నష్టపోయిందన్నారు. Also read: AP: ప్రజాభిప్రాయం అనంతరమే నూతన ఇసుక విధానం ఖరారు