Ap Assembly updates: CBN ..చంద్రబాబు పేరుకు అర్ధం చెప్పిన జగన్..అందుకే రాలేదటగా

Ap Assembly updates: ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలిరోజు మొత్తం నవ్వులే నవ్వులు పూయించారు ముఖ్యమంత్రి వైెఎస్ జగన్. ప్రతిపక్ష వైఖరిపై జగన్ వేసిన వ్యంగ్యబాణాలు ఫన్నీగా వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు పేరైన సీబీఎన్ కు కొత్త అర్ధాన్ని కూడా చెప్పారు జగన్.

Last Updated : Nov 30, 2020, 06:35 PM IST
  • ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం
  • సీబీఎన్ పదానికి కొత్త అర్దం చెప్పి సభను నవ్వించిన జగన్
  • సీబీఎన్ అంటే కరోనాకు భయపడే నాయుడు
Ap Assembly updates: CBN ..చంద్రబాబు పేరుకు అర్ధం చెప్పిన జగన్..అందుకే రాలేదటగా

Ap Assembly updates: ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల తొలిరోజు మొత్తం నవ్వులే నవ్వులు పూయించారు ముఖ్యమంత్రి వైెఎస్ జగన్. ప్రతిపక్ష వైఖరిపై జగన్ వేసిన వ్యంగ్యబాణాలు ఫన్నీగా వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు పేరైన సీబీఎన్ కు కొత్త అర్ధాన్ని కూడా చెప్పారు జగన్.

ఏపీ అసెంబ్లీ ( Ap Assembly ), బీఏసీ సమావేశమంతా ఇవాళ జోకులతో నిండిపోయింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Cm ys jagan ) వేసిన జోకులివి. జోకులతో, వ్యంగ్య బాణాలతో, సెటైర్లతో జగన్ రక్తి కట్టించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సీరియస్ గా చేసిన నిరనస వ్యవహారాన్ని కూడా కామెడీగా తీసి పారేశారు. 

బీఏసీ సమావేశంలో టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడి ( Tdp leader Atchannaidu )ని ఓ ఆట ఆడుకున్న జగన్..తరువాత సభలో చంద్రబాబును టార్గెట్ చేశారు. బీఏసీలో అచ్చెన్నాయుడిపై చేసిన సెటైరికల్ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా చంద్రబాబు వైఖరిపై మాట్లాడుతూ...జగన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అసలు అసెంబ్లీలో చంద్రబాబు ఎందుకు రెచ్చిపోయారో కూడా తెలియదంటూ ఎద్దేవా చేశారు. రామా నాయుడో డ్రామా నాయుడో మాట్లాడుతుంటే మద్యలో చంద్రబాబు రెచ్చిపోయారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

ఏపీలో వరదలు వస్తే..హైదరాబాద్ వదిలిపెట్టి బయటకు రాని వ్యక్తి రైతుల మీద ముసలి కన్నీరు కారుస్తున్నాడని విమర్శించారు జగన్. అసలు సీబీఎన్ అంటే కరోనాకు భయపడే నాయుడు అని అర్ధం. మొన్ననే రాజా చెప్పాడు అంటూ వైఎస్ జగన్ అనడం సభలో నవ్వులు పూయించింది. చంద్రబాబు నాయుడు ( Chandrababu naidu )పేరుకి షార్ట్ కట్ CBN అని అందరికీ తెలిసిందే. CBN అనే మూడు అక్షరాలకు కొత్త అర్ధాన్ని వైఎస్ జగన్ సభకు వివరించారు.

ఏపీ అసెంబ్లీలో తొలిరోజు రైతులకు పంట నష్టపరిహారం అంశంపై చర్చ జరిగింది. టీడీపీ ( Tdp ) సభ్యులు ప్రభుత్వాన్ని ఈ అంశంపై ప్రశ్నించినప్పుడు..డిసెంబర్ 15 వరకూ ఎన్యూమరేషన్ జరుగుతుందని..31న పంట నష్టం భీమా చెల్లిస్తామని ప్రభుత్వం వివరించింది. అయితే దీనిపై టీడీపీ ఎమ్మెల్యేలు రాద్ధాంతం చేయడానికి ప్రయత్నించినప్పుడు.. సీఎం జగన్ దీటుగా కౌంటర్ ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలకు బుర్రలేదని..టాప్ ఫ్లోర్ ఖాళీ అయిపోయిందని ఎద్దేవా చేశారు. Also read: AP: చంద్రబాబు అండ్ కో పై వైఎస్ జగన్ పంచ్‌లు వింటారా…

Trending News