ఢిల్లీకి సీఎం జగన్ 2 రోజుల పర్యటన ?

ఢిల్లీకి సీఎం జగన్ 2 రోజుల పర్యటన ?

Updated: Oct 10, 2019, 05:45 PM IST
ఢిల్లీకి సీఎం జగన్ 2 రోజుల పర్యటన ?
File photo

అమరావతి: ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను కలిసేందుకు జగన్ ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే, అమిత్‌ షాతో భేటీ ఖరారైనప్పటికీ.. ప్రధానితోనే భేటీపై ఇంకా ఓ స్పష్టత రాలేదని వార్తలొస్తున్నాయి. ఒకవేళ శుక్రవారం ఈ ఇరువురిలో ఎవ్వరిని కలవడం కుదరకపోయినా.. అవసరమైతే శనివారం కూడా జగన్‌ ఢిల్లీలోనే ఉండొచ్చనేది ఆ వార్తల సారాంశం. అంతేకాకుండా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ ఆయన సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయని వార్తలు వెలువడుతున్నాయి. 

రాష్ట్ర విభజన చట్టంలోని హామీలు, అపరిష్కృత సమస్యలు, నిధుల విడుదల వంటి అంశాలపై చర్చించేందుకే జగన్ ఢిల్లీకి వెళ్తున్నట్టు తెలుస్తోంది.