Pawan Kalyan: రూట్ మార్చిన జనసేనాని.. దక్షిణాది బాల్ థాక్రే కాబోతున్నారా..!

Pawan Kalyan Latest News Updates: ఏపీలో జనసేన పార్టీలో మరో శివసేనగా మారబోతోందా..! పవన్ కళ్యాణ్‌ దక్షిణాది బాల్ థాక్రే కాబోతున్నారా..! హిందూత్వం ఎజెండాగా దక్షిణాదిలో పవన్ దడ పుట్టించబోతున్నారా..! జనసేన ఆవిర్భావ సభలలో జనసేనాని ఇచ్చిన క్లారిటీ ఇదేనా..! అంతేకాదు.. దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ సభలు ఉండబోతున్నాయా..! తనదైన శైలిలో పవన్ స్పీచ్‌లకు రెడీ అవుతున్నారా..! ఈ విషయంలో ఇప్పటికే జనసేన గ్రౌండ్ ప్రిపేర్ చేసిందా..!    

Written by - Ashok Krindinti | Last Updated : Mar 17, 2025, 08:16 PM IST
Pawan Kalyan: రూట్ మార్చిన జనసేనాని.. దక్షిణాది బాల్ థాక్రే కాబోతున్నారా..!

Pawan Kalyan Latest News Updates: ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ హిందుత్వ పార్టీగా మారబోతున్నట్టు తెలుస్తోంది. ఉత్తరాదిలో శివసేనలా దక్షిణాదిలో జనసేన మారుతోందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. హిందూత్వం ఎజెండాగా దక్షిణాదిలో పవన్ దడ పుట్టించబోతున్నారని సమాచారం. ఇటీవల పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభలో జనసేనాని మాటలు చూస్తే.. ఇక హిందుత్వ ఎజెండాగానే పార్టీ కార్యకలాపాలు సాగుతాయన్న ప్రచారం జరుగుతోంది. గతంలోనూ తిరుమల లడ్డూ వ్యవహారంలో పవన్‌ కల్యాణ్‌ స్పందించిన తీరుతో యావత్ హిందువులంతా ఆయనకు మద్దతుగా నిలిచారు. ఆ తర్వాత సనాతన ధర్మం పేరుతో పవన్ కల్యాణ్‌ను యావత్‌ హిందూవులకు దగ్గరయ్యారు. ఇప్పుడు ఆయనలో పూర్తి మార్పులు కనిపిస్తున్నాయి. దాంతో ఆయన దక్షిణాది బాల్‌ థాక్రే కాబోతున్నారా అన్న చర్చకు తెరలేచింది. 

Add Zee News as a Preferred Source

ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ ఏర్పడేందుకు ముఖ్య కారణం పవన్‌ కల్యాణే అని చెప్పాలి.. వైసీపీకి అధికారం దక్కొదన్న ఏకైక లక్ష్యంతో కూటమిగా మూడు పార్టీలు జట్టుకట్టేలా చేశారు. పవన్ దెబ్బకు వైఎస్‌ జగన్ సీఎం సీటులో నుంచి దిగిపోయారు. దాంతో కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాయి. డిప్యూటీ సీఎంగా పవన్‌ కల్యాణ్‌ సేవలందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రధాని మోడీకి చాలా దగ్గరయ్యారు. ప్రధాని మోడీ పవన్‌ కల్యాణ్‌కు అంత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతేకాకుండా పవన్‌ కల్యాణ్ సేవలను దేశమంతటా వాడుకోవాలని ప్రధాని ఆలోచనగా ఉందని చెబుతారు. ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లోనూ పవన్‌ కల్యాణ్‌ ప్రచారం నిర్వహించారు. పవన్ కల్యాణ్‌ ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్ధులు ఘన విజయం సాధించారు. దాంతో వచ్చే ఏడాది జరిగే తమిళనాడు ఎన్నికల్లోనూ పవన్‌ కల్యాణ్‌ సేవలను వాడుకోవాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. 
 
తాజాగా పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ గ్రాండ్‌గా జరిగింది. ఈ సభలో పవన్ ప్రసంగానికి నేతలంతా ఫిదా అయ్యారు. దేశంలో డీలిమిటేషన్‌, ‌ త్రిభాషా విధానం, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ లో హిందులపై దాడులు, గోద్రా మారణహోమం వంటి ఆంశాలను తన ప్రసంగంలో ప్రస్థావించారు. ఈ ప్రసంగం మొత్తం విన్నాక.. పవన్ కల్యాణ్‌ మహారాష్ట్రలో మరో బాల్‌ థాక్రే కాబోతున్నారనే చర్చ జరుగుతోంది. అప్పట్లో బాల్‌ థాక్రే యావత్‌ హింధూవులకు ప్రతినిధిగా ఉండేవారు. ఆయన రాజకీయాలన్నీ హిందువుల ప్రతిష్టను కాపాడేలా జరిగేవి. హిందువులను ఎవరైనా పలెత్తు మాట అన్న ఆయన తట్టుకోలేకపోయేవారు. అందుకే ఆయనకు దేశవ్యాప్తంగా లక్షల్లో అభిమానులు ఉండేవారు. ఇప్పుడు పవన్‌లో ఇవే లక్షణాలు కనిపిస్తున్నాయని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. పవన్‌ దక్షిణాది నుంచి మరో బాల్ థాక్రే అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.. 
 
మొత్తంమీద త్వరలోనే దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కల్యాణ్‌ సభలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది తమిళనాడులోనూ పవన్‌ చేత ప్రచారం చేయించే యోచనలో కాషాయ పెద్దలు ఉన్నారట. తమిళనాడులో తెలుగు ప్రజల సంఖ్య లక్షల్లో ఉంటుంది. చెన్నైలో అభ్యర్ధుల గెలుపు ఓటములు డిసైడ్‌ చేసేది తెలుగు ప్రజలే అని చెబుతారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో పాగా వేయాలంటే పవన్‌ అయితేనే సరిపోతాడని కాషాయపెద్దలు భావిస్తున్నారట. మరోవైపు యువతే లక్ష్యంగా పవన్ స్పీచ్‌లు ఉండబోతున్నాయని అంటున్నారు.

Also Read: Ar Rahman: ఏఆర్ రెహమాన్ ఇప్పటికి నా భర్తే.. ఎమోషనల్ అయిన సైరా భాను.. స్టోరీ ఏంటంటే..?  

Also Read: Shani dev Effect: శని కుబేర యోగంతో ఈ రాశుల వారికీ పట్టిందల్లా బంగారమే.. వీరి జీవితాల్లో అష్టైశ్వార్యాలే..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

About the Author

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News