)
Pm modi great leader dy cm pawan kalyan in public meeting: ఎలాంటి ఫలితం ఆశించకుండా దేశ సేవే పరమావధిగా పని చేస్తున్న కర్మ యోగి ప్రధాని మోదీ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభివర్ణించారు. మోదీ తన దేశ సేవతో ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలిచారన్నారు పవన్. సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్ పేరిట కర్నూల్ జిల్లా నన్నూరులో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోదీ, గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఏపీ సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
దేశంలో పన్నుల భారం పెరగడమే తప్ప ఎప్పుడూ తగ్గిన దాఖలాలే లేవన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రధాని మోదీ తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణలతో.. పేదలు, సామాన్యులకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుందన్నారు. విద్యా, వైద్యం ఖర్చుల భారం నుంచి ప్రజలకు ఊరట లభిస్తుందన్నారు.
జీఎస్టీ 2.0తో ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ. 20 వేల వరకు ఆదా అవుతుందన్నారు పవన్ కళ్యాణ్. ఆత్మ నిర్భర భారత్ ద్వారా ప్రపంచ పటంలో మన దేశాన్ని నిలబెట్టిన ఘనత ప్రధాని మోదీనే అని పవన్ కొనియాడారు.
ధర్మాన్ని పట్టుకొని ముందుకు సాగే మోదీ లాంటి వ్యక్తి ప్రధానిగా ఉండటం మన అదృష్టమన్నారు పవన్ కళ్యాణ్. మోదీ దేశాన్ని మాత్రమే కాకుండా రెండు తరాలను ముందుకు తీసుకెళ్తున్నారని.. భవిష్యత్ తరాలకు మార్గదర్శకులుగా నిలుస్తున్నారని చెప్పారు. దేశం గర్వంగా తల ఎత్తుకునేలా ఆత్మనిర్భర్ భారత్ కల్పన చేశారని, మనం సేవకులు మాత్రమే కాదని అవసరమైతే ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తామని చాటి చెప్పారన్నారు పవన్.
దేశ జెండా ఎంత పౌరుషంగా ఉంటుందో.. అలాగే దేశ పటాన్ని మోదీ ప్రపంచపటంలో నిలబెట్టారన్నారు పవన్ కల్యాణ్.. మన రాష్ట్రంలో రూ. 13 వేల కోట్లకు మించి అభివృద్ధి పనులకు ప్రారంభం చేశారన్నారు పవన్ కళ్యాణ్. ఓర్వకల్లు పారిశ్రామిక ప్రాంతంలో మాత్రమే రూ. 4 వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని.. పెట్టుబడులు రావాలంటే ప్రభుత్వాలపై పూర్తి నమ్మకం ఉండాలని పవన్ అన్నారు.
ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం 15 ఏళ్లు ఉండాలని ఆకాక్షించారు పవన్ కల్యాణ్. దీని కోసం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకొని నిలబడతామన్నారు. ఇబ్బందులు ఉన్నా.. ఏమున్నా తట్టుకుని నిలబడాలని సూచించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయకత్వంలో అందరం సమిష్టిగా పనిచేస్తామని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. ప్రధాని దేశాన్ని మాత్రమే కాదు.. రెండు తరాలను నడుపుతున్నారన్నారు. దేశం తలెత్తి చూసే విధంగా ఆత్మనిర్భర్ భారత్ తీసుకువచ్చారని ప్రశంసించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook