close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి తప్పిన ప్రమాదం !!

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి  పుష్ప శ్రీవాణి విజయనగరం జిల్లాలో పర్యటించారు

Updated: Jun 15, 2019, 02:26 PM IST
డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి తప్పిన ప్రమాదం !!

విజయనగరం: ఏపీ డిప్యూటీ సీఎం  పుష్ప శ్రీవాణికి ప్రమాదం తప్పింది. ప్రముఖ మీడియా కథనం ప్రకారం రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి తొలిసారి సొంత కు జిల్లాకు వచ్చిన పుష్ప శ్రీవాణికి వైసీపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా  భోగా పురం మండలం రాజాపులోవలో ఆమెకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మంత్రికి అభినందనలు తెలిపేందుకు ఎక్కువ మంది ఎక్కడంతో సభా వేదిక ఒక్కసారిగా కూలిపోయింది.

ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమవడంతో అందరూ క్షేమంగా బయటపడ్డారు. సభా వేదిక కూలిన వెంటనే అప్రమత్తమైన మంత్రి పుష్ప శ్రీవాణి వెంటనే కిందకు దిగడంతో ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి  ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ పరిణామంతో వెంటనే మంత్రి తిరిగి విజయనగరం పయనమయ్యారు.