)
Ap dgp harish Gupta strict warning on social media controversy posts: ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటికే సోషల్ మీడియా పోస్ట్ లపై సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ప్రజల్ని తప్పుదొవ పట్టించేలా పోస్టులు, వీడియోలు పెడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.
దీని వెనకాల ఎవరున్న కూడా వదిలేది లేదని స్పష్టం చేశారు.ఈ క్రమంలో తాజాగా.. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్త సైతం సోషల్ మీడియా పోస్టులు, రెచ్చగొట్టే ప్రసంగాలపై సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ముఖ్యంగా.. సామాజిక మాధ్యమాలను అడ్డం పెట్టుకుని .. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా పోస్టులు పెట్టినా, ఇతరులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఘటన వెనకాల ఎవరున్న, ఎంతటి పెద్ద నాయకున్న పార్టీలకతీతంగా చర్యలుంటాయని హెచ్చరించారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఈ ఒక్క అంశంను చూస్తు ఊరుకోబోమన్నారు. దీనిపై సైబర్ విభాగాల సమన్వయంతో పనిచేస్తామన్నారు. వీఐపీల నుంచి సామాన్యులైనా ఎవరి గౌరవానికి భంగం కలిగించినా చర్యలు ఒకేలా ఉంటాయన్నారు.
ఫొటోలు, వీడియోలు లేదా కనీసం వ్యాఖ్యల రూపంలో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే చట్టపరమైన పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందన్నారు. టెక్నాలజీని బాధ్యతాయుతంగా ఉపయోగించుకొవాలని సూచించారు.
మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ దుర్వినియోగంపై కూడా డీజీపీ తీవ్రంగా స్పందించారు. ఏఐ సాయంతో ఫేక్ వీడియోలు సృష్టించి అశాంతికి కారణమయ్యే వారిని పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోరని డీజీపీ తెల్చి చెప్పారు. పోస్టులు పెట్టిన వారిని, వాటిని వైరల్ చేసిన వారిని సైతం కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ హరీష్ గుప్త తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook