AP DSC Notification Released 2025: ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు బంపర్ గుడ్‌న్యూస్. రాష్ట్రంలో 16,347 పోస్టులకు సంబంధించి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. ఇక నేటి నుంచి మే 15వ తేదీ వరకు డీఎస్సీకి దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నారు. ఇక అధికారిక వెబ్‌సైట్ లో డీఎస్సీకి దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి లోకేష్ తెలిపారు.
ఎన్నో రోజులుగా ఏపీ డీఎస్సీ అభ్యర్థులు ఈ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో తాజాగా మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ఆంధ్ర ప్రదేశ్ విడుదల అయింది. అధికారిక వెబ్‌సైట్ https://cse.ap.giv.in, https://apdsc.apcfss.in దరఖాస్తు చేసుకోవచ్చు.
కూటమి సర్కార్ ఇచ్చిన హామీ మేరకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనేపథ్యంలో జీవోలు ఖాళీల వివరాలు షెడ్యూల్, సిలబస్ కూడా నోటిఫికేషన్లు పొందుపరిచారు, అధికారిక వెబ్‌సైట్లో సమాచారం పొందవచ్చు. డీఎస్సీ నోటిఫికేషన్ లో జిల్లా స్థాయిలో 14088, స్టేట్ జోన్ లెవెల్ 2259, సెకండరీ టీచర్ గ్రేడ్ ఖాళీలు 6,599, ఉమ్మడి జిల్లాల సబ్జెక్టుల వారీగా ఖాళీలు 13 ఉన్నాయి.
ఇక మొత్తంగా టీచర్ పోస్టులు 16,347 పోస్టుల భర్తీకే ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అంటే ఈరోజు ఆదివారం ఏప్రిల్ 20, 2025 నుంచి అందుబాటులోకి రానుంది. దరఖాస్తుల ప్రక్రియ ఈరోజు నుంచి మే 15 వరకు కొనసాగుతుంది. ఇక హాల్ టికెట్లు మే 30వ తేదీ అందుబాటులో ఉంచుతారు. కంప్యూటర్ బెస్ట్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. జూన్ 6 నుంచి జూలై 6 వరకు కొనసాగుతుంది.
Another promise kept!
The Mega DSC Notification for 16,347 teacher posts has been released.
Online Application submission is LIVE.
? Application Portals:
? https://t.co/xMSx9NycwQ
? https://t.co/acflj2kIh3For a smooth application process, please refer to the video and… pic.twitter.com/DTCoGEE0fW
— Lokesh Nara (@naralokesh) April 20, 2025
ఇక ఈ డీఎస్సీ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ పరీక్ష ముగిసిన రెండు రోజులకు అందుబాటులో ఉంచుతారు. ఇది ఇలా ఉండగా అభ్యంతరాల స్వీకరణ వారం రోజులు అందుబాటులో ఉంటుంది. ఫైనల్ కీ జూలై మూడో వారంలో అందుబాటులో ఉంచగా ..మెరిట్ లిస్ట్ మాత్రం జూలై చివరి వారంలో పొందుపరుస్తారు. అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్‌సైట్ చెక్ చేసుకుంటూ ఉండాలి.
ఇదీ చదవండి: ఎప్పుడూ సీరియస్‌గా ఉండే డొనాల్డ్ ట్రంప్ .. ఏపీ రైతులా మారితే ఎలా ఉంటాడు? వీడియో చూడండి..
ఇదీ చదవండి: తిరుమలలో వేసవి రద్దీ వేళ.. వీఐపీ సిఫార్సు లేఖల తిరస్కరణ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









