YS Jagan: ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) బీజేపీ విషయంలో ఎటు తేల్చుకోలేకపోతున్నారా..? ఏపీలో టీడీపీ,బీజేపీ, జనసేన కూటమి అధికారంలో ఉన్నా.. బీజేపీతో జగన్ దోస్తీ కంటిన్యూ చేస్తున్నారా.. అంటే తాజా రాజకీయ పరిణామాలతో అవుననే తెలుస్తోంది. తనపై కేసుల నేపథ్యంతో పాటు కాంగ్రెస్ పార్టీ తనను ఎలా వేధింపులకు గురి చేసిందనే ఇష్యూ కారణంగా ఆయన బీజేపీకి దగ్గరగా ఉంటున్నారు. ఒకవేళ కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ తో ఢీ కొడితే.. ఏమవుతుందో గతంలో చంద్రబాబుకు జరిగిన శాస్తి తనకు ఎక్కడా జరుగుతుందనే భయం కూడా వైయస్ జగన్ మోహన్ రెడ్డిని వెంటాడుతుంది. ఒక వేళ కేంద్రంతో సున్నం పెట్టుకుంటే.. ఏమవుతుందనే సంగతి జగన్ కు తెలుసు. అందుకనే కర్ర విరగకుండా... పాము చావుగుండా అనే రీతిలో ప్రధాన మంత్రికి డీ లిమిటేషన్ పై ఓ లేఖ రాసారు.
డీలిమిటేషన్ లో దక్షిణాదికి నష్టం కల్గుతుందనే టాక్ వస్తోంది. ఆ విషయంలో కేంద్రంతో యుద్ధం ప్రకటించిన తమిళనాడు సీఎం స్టాలిన్.. చెన్నైలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఎన్డీఏ పక్షాలను మినహాయించి అన్ని పార్టీలను ఆహ్వానించారు. అమరావతికి వెళ్లి జగన్ ను కలిసి ఆహ్వానించారు డీఎంకే నేతలు.
అయినా చెన్నై మీటింగ్‌కు జగన్ వెళ్లలేదు. బీజేపీకి వ్యతిరేకంగా పోవడానికి భయపడే.. స్టాలిన్ సమావేశానికి జగన్ వెళ్లలేదని చెబుతున్నారు. బీజేపీ విషయంలో జగన్ డైలామాలో ఉన్నారనే టాక్ వస్తోంది. కేంద్రంపై మాట్లాడానికి ఏమి లేకపోవడంతో దక్షిణాదికి అన్యాయం అని తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికే స్టాలిన్ సహా ఇండి కూటమి నేతలు డీ లిమిటేషన్ రాగాన్ని అందుకున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.









