ఏపీ బడ్జెట్ ఎలా ఉంటుందో చెప్పిన మంత్రి బుగ్గన
ఏపీ బడ్జెట్ 2019-20పై స్పందించిన మంత్రి బుగ్గన
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన అనంతరం నేడు తొలిసారిగా జగన్ సర్కార్ ప్రవేశపెట్టబోతున్న ఏపీ బడ్జెట్‌పైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విజయవాడలోని తన నివాసం నుంచి బడ్జెట్ పత్రాలతో సచివాలయానికి బయల్దేరే సమయంలో మీడియాతో మాట్లాడుతూ... నవరత్నాల అమలు పర్చడంతోపాటు అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా, అందరికీ ఆశాజనకంగా రాష్ట్ర బడ్జెట్ ఉంటుందని అన్నారు. రాష్ట్రాన్ని రెవెన్యూ లోటు పీడిస్తున్నప్పటికీ.. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలనే లక్ష్యంతో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ని తీర్చిదిద్దినట్టు తెలిపారు. తమ సర్కార్‌పై ప్రజలకున్న నమ్మకాన్ని వమ్ము చేయమని మంత్రి బుగ్గన స్పష్టంచేశారు.