AP Exams: ఏపీలో పదవ తరగతి , ఇంటర్మీడియట్ పరీక్షలకు రంగం సిద్ధం

AP Exams: ఏపీలో పదవ తరగతి, ఇంటర్ పరీక్షలకు షెఢ్యూల్ తిరిగి ఖరారైంది. కరోనా మహమ్మారి అదుపులో వస్తుండటంతో జూలై నెలలో వాయిదా పడిన పరీక్షల్ని నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ ఆమోదించే అవకాశాలున్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 17, 2021, 11:55 AM IST
AP Exams: ఏపీలో పదవ తరగతి , ఇంటర్మీడియట్ పరీక్షలకు రంగం సిద్ధం

AP Exams: ఏపీలో పదవ తరగతి, ఇంటర్ పరీక్షలకు షెఢ్యూల్ తిరిగి ఖరారైంది. కరోనా మహమ్మారి అదుపులో వస్తుండటంతో జూలై నెలలో వాయిదా పడిన పరీక్షల్ని నిర్వహించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ ఆమోదించే అవకాశాలున్నాయి.

కరోనా సెకండ్ వేవ్ ( Corona Second Wave) కారణంగా ఏపీలో పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. తెలంగాణలో పదవ తరగతి పరీక్షల్ని పూర్తిగా రద్దు చేసినా..ఏపీలో మాత్రం ప్రభుత్వం వాయిదా వేసింది. కరోనా మహమ్మారి ఇప్పుడు తగ్గుముఖం పడుతుండటంతో తిరిగి నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ ప్రతిపాదన సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ap cm ys jagan) ఆమోదం కోసం ఆయన ముందుకు తీసుకెళ్తోంది. పరీక్షల నిర్వహణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ నిర్ణయం తీసుకోనున్నారు.

పదవ తరగతి పరీక్షల్ని జూలై 26 వ తేదీ నుంచి ఆగస్టు 2 వరకూ నిర్వహించాలని ఏపీ విద్యాశాఖ (Ap Education Department)షెడ్యూల్ సిద్ధం చేసింది.సెప్టెంబర్ 2వ తేదీలోగా పదవ తరగతి ఫలితాలు విడుదల చేయనుంది. మరోవైపు ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు కొన్ని ప్రతిపాదనలు చేసింది. 11 పేపర్ల స్థానంలో 7 పేపర్లకు పరీక్షలు నిర్వహించనుంది. రోజు విడిచి రోజు ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సర పరీక్షల్ని నిర్వహించనుంది. జూలై 7 నుంచి 25 వ తేదీ వరకూ ఇంటర్మీడియట్ పరీక్షల్ని నిర్వహించేందుకు ప్రతిపాదన సిద్ధమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆమోదం లభిస్తే..ఇక షెడ్యూల్ విడుదల కానుంది.

Also read: AP High Court: కోవిడ్, బ్లాక్ ఫంగస్ నియంత్రణ చర్యలపై ఏపీ హైకోర్టులో విచారణ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News