Ap SSC Exam 2021: ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి పరీక్షల విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. గ్రూప్ కాంబినేన్స్  నామినల్ రోల్స్, లాంగ్వేజెస్ విషయంలో కీలకమైన మార్పులతో ప్రభుత్వం సర్క్యులర్ విడుదల చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏపీలో పదవ తరగతి పరీక్షలు (Ap SSC Exams) జూన్‌లో జరగనున్నాయి. పదవ తరగతి పరీక్షలకు సంబంధించి ప్యాట్రన్‌లో మార్పులు రానున్నాయి. తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి చేశారు. గ్రూప్ కాంబినేషన్లు, నామినల్ రోల్స్ అంశాలకు సంబంధించి ప్రధానోపాధ్యాయులకు సూచనలు చేస్తూ సర్క్యులర్ విడదలైంది. పరీక్ష పేపర్లు, సమయం, మార్కుల వంటి అంశాల్ని ఇందులో వివరించారు. తొలిసారి పరీక్షకు హాజరయ్యే రెగ్యులర్ విద్యార్ధులు తెలుగు భాషను ఫస్ట్ లాంగ్వేజ్ లేదా సెకండ్ లాంగ్వేజ్ కింద తప్పనిసరి చేసింది. తెలుగు ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌గా ఉన్న విద్యార్థులు సెకండ్‌ లాంగ్వేజ్‌ కింద హిందీ తప్పనిసరిగా రాయాలి.


ఇంగ్లీషు మీడియం( English medium) అభ్యర్ధులు ఫస్ట్ లాంగ్వేజ్ కింద తెలుగును ఎంచుకుంటే సెకండ్ లాంగ్వేజ్ పేపర్‌గా హిందీ మాత్రమే తీసుకోవాలి. తమిళం, కన్నడ, ఒరియా తదితర మాతృభాషలను ఫస్ట్‌ లాంగ్వేజ్‌గా ఎంచుకున్న విద్యార్థులు రెండో పేపర్‌గా తెలుగును తప్పనిసరిగా రాయాలి. పబ్లిక్‌ పరీక్షల్లో.. ఇంటర్నల్‌ మార్కులకు వెయిటేజీ ఉండదు. మిగిలిన ఏడు పేపర్లలో ఫస్ట్‌ లాంగ్వేజ్, సెకండ్‌ లాంగ్వేజ్, థర్డ్‌ లాంగ్వేజ్, మేథమెటిక్స్, సోషల్‌ స్టడీస్‌ పరీక్షలు ఒక్కొక్కటి  వంద మార్కులకు ఉంటాయి. ఫిజికల్‌ సైన్సు, బయోలాజికల్‌ సైన్సు పరీక్షలు 50 మార్కుల చొప్పున వేర్వేరుగా ఉంటాయి.


ఫస్ట్‌ లాంగ్వేజ్‌ కాంపోజిట్‌ పేపర్‌–1..70 మార్కులకు, పేపర్‌–2..30 మార్కులకు ఉంటుంది. లాంగ్వేజ్‌ పరీక్షలు, మేథమెటిక్స్, సోషల్‌ స్టడీస్ (Social studies)‌ పరీక్షలు రాసేందుకు ఒక్కో పేపర్‌కు 3 గంటలు, ప్రశ్నపత్రం చదువుకునేందుకు 15 నిమిషాలతో కలిపి మొత్తం 3 గంటల 15 నిమిషాలుంటుంది. ఫిజికల్‌ సైన్సు, బయోలాజికల్‌ సైన్సు పరీక్షలు రాసేందుకు 2 గంటల 30 నిమిషాలుంటుంది. ప్రశ్నపత్రం చదువుకునేందుకు 15 నిమిషాలతో కలిపి మొత్తం 2 గంటల 45 నిమిషాలుంటుంది. 2017 మార్చ్‌లో తొలిసారి టెన్త్‌ పరీక్షలకు హాజరై  2019 జూన్ వరకూ ఆ పరీక్షల్ని పూర్తి చేయనివారు కొత్త విధానంలో ప్రస్తుతం నిర్వహించే పరీక్షలకు రిజిష్టర్‌ కావచ్చు.


ఇంటిపేరుతో సహా అభ్యర్ధి పూర్తి పేరు, తండ్రి, తల్లి పూర్తి పేర్లు నమోదు చేయాల్సి ఉంటుంది. అనాథలైతే సంరక్షకుల పేర్లు నమోదు చేసుకోవాలి. స్కూల్ రికార్డులో నమోదైనవారిని మాత్రమే రెగ్యులర్ అభ్యర్ధులుగా పరిగణిస్తారు. గుర్తింపు ఉన్న స్కూలు నామినల్‌ రోల్స్‌ మాత్రమే రెగ్యులర్‌ అభ్యర్థులుగా అప్‌లోడ్‌ చేయాలి. చెవిటి, మూగ, అంధత్వం తదితర బహుళ దివ్యాంగులకు రెండు లాంగ్వేజ్‌లకు బదులు ఒక్కటే ఎంచుకోవచ్చు. ప్రతి సబ్జెక్ట్‌కు పాస్ మార్కులు 20 మాత్రమే.


Also read: Kollu Ravindra Bail: ఏపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు బెయిల్ మంజూరు చేసిన కోర్టు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook