)
AP Fee Reimbursement funds release: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విషయంలో విద్యార్థులకు ఉపశమనం కల్పించింది. 2023-24, 2024-25 విద్యా సంవత్సరాల్లో ఉన్నత విద్య కోర్సుల ఫైనలియర్ పూర్తి చేసి బయటకు వచ్చిన విద్యార్థుల ఫీజు బకాయిల కోసం.. ప్రభుత్వం రూ. 400 కోట్లు విడుదల చేసింది.
2024-25 విద్యా సంవత్సరం ఫీజులను కాలేజీల అకౌంట్లలోనే జమ చేస్తారు. అయితే, అంతకముందు 2023-24 విద్యా సంవత్సరం వరకు ఉన్న నిబంధనల ప్రకారం.. ఆ విద్యా సంవత్సరం ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను స్టూడెంట్స్ తల్లుల అకౌంట్లలో జమ చేయాల్సి ఉంటుంది.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత.. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను కాలేజీ యాజమాన్యాల అకౌంట్లలో కాకుండా.. విద్యార్థుల తల్లుల అకౌంట్లలో జమ చేస్తూ వచ్చింది. ఆ సమయంలో విద్యార్థుల తల్లులు ఆ మొత్తాన్ని కాలేజీకి చెల్లించేవారు. ఆపై విద్యార్థి, వారి తల్లి పేరు మీద జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి ఫీజురీయింబర్స్‌మెంట్‌ను.. ఆ అకౌంట్లలో జమ చేసేవారు.
ఆ విధానం ప్రకారం 2023-24 విద్యా సంవత్సరం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను.. విద్యార్థుల తల్లుల అకౌంట్లలో వేయాల్సి ఉంటుంది. అయితే, ఫీజులు కట్టకపోయినా తాము సర్టిఫికెట్లు ఇచ్చామని.. అందువల్ల ఆ ఫీజులు తమకే ఇవ్వాలని కొన్ని కాలేజీలు కోరాయి. ప్రభుత్వం దీనిపై సర్వే చేయగా.. చాలా వరకు కాలేజీలు ఇప్పటికే ఫీజులు వసూలు చేసినట్లు తేలింది. దీంతో ఆ విద్యా సంవత్సరం ఫీజులను తల్లుల అకౌంట్లలోనే జమ చేసే అవకాశం ఉంది.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు చెల్లింపు విధానంలో మార్పులు చేసింది. గతంలోలా విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను నేరుగా కాలేజీ యాజమాన్యాల అకౌంట్లలోనే జమ చేసేలా మార్పు చేసింది. దీంతో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ నగదును.. ప్రభుత్వం నేరుగా కాలేజీ యాజమాన్యాల అకౌంట్లలో జమ చేయనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook