)
AP Anganwadi Recruitment 2025: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం మహిళలకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో అంగన్వాడీ సహాయకుల పోస్టులను భారీ ఎత్తున భర్తీ చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంగన్వాడీ కేంద్రాల్లో సేవలను మరింత మెరుగుపరచడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇటీవల 4,687 మినీ అంగన్వాడీలను పూర్తి స్థాయి అంగన్వాడీలుగా మార్చారు. ఇప్పుడు ఈ కేంద్రాల్లో 4,687 సహాయకుల పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నియామకాలను త్వరగా పూర్తి చేయాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇప్పటికే మినీ అంగన్వాడీ కార్యకర్తలకు పదోన్నతి ఇస్తూ 4,687 మందిని పూర్తి స్థాయి కార్యకర్తలుగా నియమిస్తున్నారు. వీరికి నెలకు 11,500 రూపాయల గౌరవ వేతనం ఇస్తారు. ఈ కొత్త నియామకాలతో అంగన్వాడీ కేంద్రాల పనితీరు మరింత మెరుగవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
విద్యార్హతలు ఏంటంటే..
1. సహాయకుల పోస్టులకు దరఖాస్తు చేసే వారు 10వ తరగతి పాసై ఉండాలి.. అలాగే వివాహితులై స్థానికంగా నివసిస్తూ ఉండాలి.
2. వయస్సు 2025 జులై 1 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కొన్ని ప్రాంతాల్లో 18 సంవత్సరాల నుంచి అర్హత ఉంటుంది.
3. ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో ఆయా వర్గాల అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి.
4. దరఖాస్తుతో పాటు కుల ధృవీకరణ, నివాసం, పుట్టిన తేదీ, 10వ తరగతి మార్కులు, ఆధార్ కార్డు వంటి పత్రాలను గెజిటెడ్ అధికారి ధృవీకరణతో జత చేయాలి.
5. ఇటీవలి ఫొటోను దరఖాస్తుపై అతికించి, దాన్ని కూడా ధృవీకరించాలి. దరఖాస్తులను స్వయంగా లేదా పోస్ట్ ద్వారా సమర్పించవచ్చు. మరిన్ని వివరాల కోసం స్థానిక అధికారులను సంప్రదించాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook