Covid19 vaccination: ఏపీ ప్రభుత్వం పూర్తిగా వ్యాక్సినేషన్ పై దృష్టి సారించింది. ఓ వైపు కరోనా నిర్ధారణ పరీక్షలు, మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరం చేయాలని అధికారులకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కరోనా వైరస్ (Corona virus) మరోసారి పంజా విసురుతోంది. భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఇటు ఏపీలో పంచాయితీ, మున్సిపల్ సమరం ముగిసింది. ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వైఖరి కారణంగా జడ్పీటీసీ -ఎంపీటీసీ ఎన్నికలు (Zptc-mptc Elections) ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఎన్నికల కారణంగా విఘతం కలిగిన వ్యాక్సినేషన్  ప్రక్రియను తిరిగి వేగవంతం చేసేందుకు ఏపీ ప్రభుత్వం(Ap government) ప్రయత్నిస్తోంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. తాజాగా ఏపీ  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కోవిడ్ నిబంధనలు పాటించాలని..కేసులు పెరుగుతున్న నేపధ్యంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షల్ని పెంచాలని సూచించారు. ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు గ్రామ సచివాలయాల్ని ఓ యూనిట్‌గా తీసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ, గ్రామ సచివాలయాల పరిధిలో ఉన్నవారికి వెంటనే వ్యాక్సినేషన్ (Vaccination) పూర్తి చేయాలన్నారు. 


45 ఏళ్ల దాటి..దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి తక్షణం వ్యాక్సిన్ అందించే ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో నూటికి నూరుశాతం ఆర్టీపీసీఆర్ పరీక్షలు (RTPCR Tests) చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 13 లక్షల 80 వేల 537 మందికి వ్యాక్సిన్ ఇచ్చారని మంత్రి ఆళ్ల నాని (Minister Alla nani) తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యపోస్టుల భర్తీపై దృష్టి సారించాలని కోరారు. అన్ని నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ పథకం మెరుగ్గా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్షలో ఆరోగ్య సాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్, ప్రిన్సిపల్ సెక్రటరీ  ముద్దాడ రవిచంద్ర ఇతర అధికారులు పాల్గొన్నారు. 


Also read: Tirupati Bypoll: తిరుపతి ఉప ఎన్నికపై వైఎస్ జగన్ సమీక్ష, నియోజకవర్గానికో మంత్రి ఇన్‌ఛార్జ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook