
Amaravati Works: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు మరోసారి ప్రారంభం కానున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు విడుదల చేస్తుండటంతో వివిధ ప్రతిపాదిత పనులు తెరపైకి వస్తున్నాయి.
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టిన కూటమి ప్రభుత్వం పలు నిర్మాణలకు టెండర్లు ఖరారు చేసింది. అత్యంత కీలకంగా భావిస్తున్న ఐకానిక్ టవర్స్ నిర్మాణానికి టెండర్లు పిలవనుంది. ఇతర పనులకు టెండర్లు ఇప్పటికే ఖరారయ్యాయి. అమరావతి నిర్మాణ పనుల రీ లాంచ్ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ వారం ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు. అమరావతి పనుల రీ లాంచ్ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతిలో నవ నగరాలకు శంకుస్థాపన చేయించనున్నారు.
ఈ నెల 23 లేదా 24 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఐకానిక్ టవర్స్ నిర్మాణంతో పాటు ఇతర పనులకు టెండర్లు ఖరార చేసేందుకు సీఆర్డీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఐదు టవర్ల నిర్మాణానికి ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం 4,687 కోట్ల వ్యయం కానుంది. ఇందులో జేఏడీ టవర్ బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా 47 అంతస్థులు ఉంటాయి. మిగిలిన 4 హెచ్ఓడీ టవర్లను 39 అంతస్థులుగా డిజైన్ చేశారు.
ఐకానిక్ టవర్ల నిర్మాణం కోసం రాయగడ, బళ్లారి, తిరుచురాపల్లి స్టీల్ ఫ్యాక్టరీలను సందర్శించారు. రాయగడలో స్టీల్ కొనుగోలు చేసి బళ్లారి, తిరుచురాపల్లిలో ఫ్యాబ్రికేట్ చేయించనున్నారు. మద్రాస్ ఐఐటీ నిపుణులు పునాదుల పటిష్టతను పరిశీలించనున్నారు. రాజధానిలో రోడ్లను చెన్నై-కోల్‌కతా హైవేతో అనుసంధానించనున్నారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు రాజధానిలోని అన్ని ప్రధాన రోడ్లు అనుసంధానమయ్యేలా డిజైన్ చేస్తున్నారు. మొత్తం 67,721 కోట్ల ఖర్చుతో అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి