AP Mega Dsc: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే మెగా డిఎస్సీ ఫైలుపై చంద్రబాబు తొలి సంతకం చేశారు. అప్పట్నించి నోటిఫికేషన్ మాత్రం వెలువడకపోవడంతో డీఎస్సీ అభ్యర్ధుల్లో నిరాశ నెలకొంది. దాదాపు పది నెలల్నించి వాయిదా పడుతూ వస్తోంది. ఇన్నాళ్లకు మళ్లీ ప్రకటన వెలువడింది.
ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ కోసం నిరుద్యోగులు చాలాకాలంగా ఎదురు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేయడంతో చాలా ఆనందించారు. కానీ ఆ తరువాత వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా మరింత ఆలస్యమైంది. ఇప్పుడు ఎట్టకేలకు మెగా డీఎస్సీపై ఏపీ విద్యా శాఖ కీలక ప్రకటన చేసింది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ మార్చ్ నెలలో విడుదల చేస్తామని తెలిపింది. జీవో 117కు ప్రత్యామ్నాయం తీసుకొస్తామని, డీఎస్సీ నియామక ప్రక్రియను ఈ విద్యా సంవత్సరం ప్రారంభం లోగా అంటే జూన్ నాటికి పూర్తి చేస్తామని వెల్లడించింది.
మెగా డీఎస్సీలో భాగంగా మొత్తం 16,247 ఉపాధ్యాయ పోస్టుల్ని ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఎలాంటి న్యాయ వివాదాలు లేకుండా నోటిఫికేషన్ విడుదలకు ముందే జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్లు 7725, సెకండరీ గ్రేడ్ టీచర్లు 6371, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచరలు 1781, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు 286, పీఈటీ పోస్టులు 132, ప్రిన్సిపల్ పోస్టులు 52 ఖాళీగా ఉన్నాయి.
ఉపాధ్యాయలు కోసం గతంలో మొత్తం 45 రకాల యాప్‌లు ఉండేవి. అయితే ఇప్పుడు వీటన్నింటినీ కలిపి ఒకే యాప్‌గా చేశామని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. త్వరలోనే టీచర్ల బదిలీ చట్టం తీసుకొస్తామన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టవచ్చన్నారు.
Also read: Terror Attack Plan: ప్రధాని మోదీ విమానంపై దాడికి ప్రయత్నం జరిగిందా, భద్రతా విభాగంలో కలకలం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









