)
APSRTC Employees: దీపావళి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. ఇప్పటికే డీఏ ప్రకటించిన ప్రభుత్వం తాజాగా పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మాజీ ఉద్యోగులకు భారీ ప్రయోజనం చేకూరనుంది. అనారోగ్యంతో బాధపడుతున్న రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నిండు రోగ్యం అందిస్తుంది.
పదవీ విరమణ చేసిన ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. విశ్రాంత ఉద్యోగులకూ ఈహెచ్ఎస్ వర్తింపజేయాలని నిర్ణయించింది. 2020 జనవరి 1 తర్వాత రిటైరైన వారికి దీన్ని వర్తింపజేయనున్నారు. ఒకసారి ప్రీమియం చెల్లిస్తే జీవితాంతం ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించారు. విశ్రాంత ఉద్యోగి భార్యకు కూడా ఉచిత వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించడం విశేషం. అంతేకాకుండా ఆర్టీసీ ఆస్పత్రుల్లోనూ ఉచిత వైద్యం, మందులు అందించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగులకు ఈహెచ్ఎస్ పథకం అమలుకోసం ఖర్చు వివరాలు కూడా ఆదేశాల్లో పేర్కొంది. సూపరింటెండెంట్ కేటగిరీ వరకు రూ.38,572 ప్రీమియం, అసిస్టెంట్ మేనేజర్, ఆపై ర్యాంకు ఉన్నవారికి రూ.51,429 చెల్లించాలని ప్రభుత్వం ఆర్టీసీ అధికారులకు సూచించింది. ఆర్టీసీ ఆస్పత్రుల సిఫారసు మేరకు ఈహెచ్ఎస్ ఆస్పత్రుల్లో పదవీ విరమణ పొందిన ఆర్టీసీ ఉద్యోగులకు.. వారి భాగస్వామికి చికిత్స అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ప్రస్తుతం ఆర్టీసీలో రెగ్యులర్ ఉద్యోగుల్లా రీయంబర్స్మెంట్ సౌకర్యాన్ని రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం కల్పించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రిటైర్డ్ ఉద్యోగులకు ఊపిరి పోసినట్టు అయ్యింది. దీర్ఘకాలిక వ్యాధులు.. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం నిర్ణయంతో భారీ పై ఆర్టీసీ సంఘాలు, ఎన్ఎంయూ, ఈయూ హర్షం వ్యక్తం చేశాయి. సీఎం, ఆర్టీసీ ఎండీ, అధికారులకు ఉద్యోగ సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి