Fishermen Diesel Subsidy: అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కో హామీని నెరవేర్చే పనిలో పడిన చంద్రబాబు ప్రభుత్వం మరో పథకాన్ని అమలుచేస్తోంది. మత్య్సకారులకు సంబంధించి రెండు కీలక పథకాలు ప్రారంభించింది. ఇటీవల 'మత్య్సకారుల సేవలో' అనే పేరిట మత్య్సకారులకు బ్యాంకు ఖాతాల్లో రూ.20 వేలు జమ చేసిన విషయం తెలిసిందే.
Also Read: Nominated Posts: టీడీపీ నాయకులకు జాక్‌పాట్.. పదవులు భర్తీ చేసిన చంద్రబాబు
సముద్రంలో వేట విరామ సమయంలో ఆర్ధిక సాయం అందిస్తామని ఎన్నికల హామీ ఇవ్వగా దానిని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ.20,000 అందించనున్నారు. 1,29,178 కుటుంబాలకు రూ.258 కోట్ల లబ్ది జరగనుంది. మత్స్యకారులను ఆర్ధికంగా ఆదుకునేలా ‘మత్స్యకారుల సేవలో’ పేరుతో సహాయం అందించనుంది. సముద్రంలో వేట విరామంతో ఉపాధి కోల్పోయే మత్య్సకారులకు ఈ సహాయం అందించనున్నారు.
Also Read: Pawan Kalyan: 'ప్రధాని నరేంద్ర మోదీ ముందు పవన్ కల్యాణ్ డ్యాన్స్‌లు చేసుకో..!'
మత్స్యకారులు, ఆక్వా రంగం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కూటమి ప్రభుత్వం ఆక్వారంగం అభివృద్ధికి, మత్స్యకారుల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోంది. స్వర్ణాంధ్ర-2047 విజన్ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఆక్వారంగాన్ని గ్రోత్ ఇంజిన్‌గా ప్రభుత్వం ఎంచుకుంది. ఈ క్రమంలోనే మత్య్సకారులకు డీజిల్‌పై రాయితీ అందిస్తోంది. బోట్లతో వేటకు వెళ్లే మత్య్సకారుల కోసం ఈ పథకాన్ని అమలు చేస్తోంది.
వేటకు వెళ్లే బోట్లకు లీటర్ డీజిల్‌పై రూ.9 సబ్సిడీ ఏపీ ప్రభుత్వం అందిస్తోంది. మెకనైజ్డ్ బోట్లకు నెలకు 3,000 లీటర్లు, మోటరైజ్డ్ బోట్లకు నెలకు 300 లీటర్ల వరకు డీజిల్‌పై సబ్సిడీ అందిస్తోంది. ఈ ఏడాది అర్హత ఉన్న 23,062 బోట్లకు డీజిల్ సబ్సిడీ కోసం రూ.50 కోట్లు కేటాయించింది. ఈ డీజిల్ రాయితీతో మత్య్సకారులకు భారీ ఉపశమనంలభించనుంది. చేపల వేటకు డీజిల్ బోట్లు వినియోగిస్తున్న విషయం తెలిసిందే. పేద మత్య్సకారుల కోసం ప్రభుత్వం ఈ పథకం అమలు చేస్తోంది.
మత్య్సకారులకు ఏపీ ప్రభుత్వ పథకాలు
మెకనైజ్డ్ బోట్లపై వేటకు వెళ్తున్న మత్స్య సోదరుల రక్షణ కోసం 3 నెలల్లో 4,484 బోట్లలో టూ వే కమ్యూనికేషన్ వ్యవస్థ త్వరలో తీసుకురానుంది. సాగర్‌మాల పథకం కింద రూ.97 కోట్లతో పులికాట్ సరస్సు దగ్గర చేపట్టే ప్రాజెక్టుతో ఆ ప్రాంతంలోని 20 వేల మత్య్సకార కుటుంబాలకు లబ్ది చేకూరనుంది.
రాష్ట్రంలో 68,396 మంది మత్స్యకారులకు నెలనెలా పింఛన్లు ఇస్తోంది.
18 నుంచి 60 ఏళ్లలోపు వయసున్న మత్స్యకారులు చేపల వేట సమయంలో మరణిస్తే రూ.10 లక్షలు నష్ట పరిహారం అందిస్తోంది. గతేడాది చనిపోయిన 63 మంది మత్స్యకారుల కుటుంబాలకు సాయం అందించగా.. మరో 80 కుటుంబాలకు త్వరలోనే సాయం అందించనున్నారు.
- ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు సముద్రంలో వేట నిషేధంలో అమలులో ఉండడంతో ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ.20,000 ప్రభుత్వం ఇస్తోంది. ఈ పథకంతో 12 తీర ప్రాంత రాష్ట్రంలో కొత్తగా 9 ఫిషింగ్ హార్బర్లను రూ.1,961 కోట్లతో రెండు దశల్లో నిర్మిస్తోంది. వీటికి అదనంగా రూ.199 కోట్లతో 7 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు కూడా సిద్ధం చేస్తోంది.
- బాపట్ల జిల్లా నిజాంపట్నంలో ఆక్వాపార్క్‌ను రూ.88 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. ఆక్వాకల్చర్‌కు యూనిట్ విద్యుత్‌కు రూ.1.50కే సరఫరా చేస్తోంది. 68,134 సర్వీస్ కనెక్షన్లకు రూ.1,187 కోట్లు ఖర్చు చేస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









