Chandrababu: మామిడి, పొగాకు, కోకో పంటల రైతులకు సీఎం చంద్రబాబు శుభవార్త

Chandrababu Good News To Mango Tobacco And Coco Farmers: మామిడి, పొగాకు, కోకో పంటల రైతులకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. వారికి కనీస మద్దతు ధర ఇస్తామని ప్రకటించారు. వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 18, 2025, 04:53 PM IST
Chandrababu: మామిడి, పొగాకు, కోకో పంటల రైతులకు సీఎం చంద్రబాబు శుభవార్త

Farmers Minimum Price: పంట ఉత్పత్తుల్ని వాణిజ్య కోణంలోనే చూడాలని.. రైతులకు ఇబ్బంది కలగకుండా పంట ఉత్పత్తుల కొనుగోలు జరగాలని అధికార యంత్రాంగానికి సీఎం చంద్రబాబు ఆదేశించారు. పంట వివరాలు, పర్యవేక్షణకు సాంకేతికత వినియోగించాలని సూచించారు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రైతులకు అండగా నిలవాలని చెప్పారు. ఎగుమతులు పెంచేందుకు అత్యుత్తమ గ్రేడింగ్ విధానాలు అమలు చేయాలని తెలిపారు.

Add Zee News as a Preferred Source

Also Read: YS Sharmila: జగన్, కేసీఆర్ కలిసి నాపై కుట్ర పన్నారు: వైఎస్‌ షర్మిల సంచలన వ్యాఖ్యలు

మామిడి, పొగాకు, కోకో పంటల మద్ధతు ధరలపై అమరావతిలోని సచివాలయంలో బుధవారం సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పొగాకు, మామిడి తదితర పంట ఉత్పత్తులకు సంబంధించి నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. పంట ఉత్పత్తులను వాణిజ్య కోణంలోనే చూడాలని, వీలైనంత మెరుగైన ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

Also Read: TTD Good News: తిరుమల భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్‌.. బోర్డ కీలక నిర్ణయాలు ఇవే!

ఈ ఏడాది హెచ్డీ బర్లీ పొగాకు 80 మిలియన్ కిలోల మేర ఉత్పత్తి వచ్చిందని సమీక్షలో అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. ఇప్పటివరకు 27 మిలియన్ కిలోల మేర విక్రయాలు జరిగినట్టు అధికారులు తెలిపారు. మిగిలిన 53 మిలియన్ కిలోల హెచ్డీ బర్లి పొగాకును త్వరగా కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. 33 మిలియన్ కిలోల పొగాకును 24 కంపెనీల ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నట్టు అధికారులు వివరించారు. మరో 20 మిలియన్ కిలోల మేర పొగాకును ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలుకు ఏర్పాట్లు చేసినట్టు సీఎం చంద్రబాబుకు అధికారులు తెలిపారు. బాపట్ల -3, గుంటూరు--2, పలనాడు -1, ప్రకాశం - 1 కొనుగోలు కేంద్రాలు ద్వారా పొగాకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని.. వీటిద్వారా రేపటి నుంచే కొనుగోళ్లు ముమ్మరం చేస్తామని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. 

పామాయిల్‌పై సుంకం తగ్గింపు, మ్యాంగో పల్ప్‌పై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించే అంశంపై  ఇప్పటికే కేంద్రంతో మాట్లాడానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దీనిపై అధికారులు సంబంధిత కేంద్ర ప్రభుత్వ శాఖలతో  సమన్వయం చేసుకోవాలని సూచించారు. మామిడి పంటకు సంబంధించి పంట ప్రణాళికపై రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని సీఎం అధికారులకు ఆదేశించారు. రైతులకు నష్టం రాకుండా ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. జూలై మొదటి వారానికి మిగిలిన ఉత్పత్తిని కూడా కొనుగోలు చేయాలని ఆదేశించారు.

రాష్ట్రవ్యాప్తంగా పండ్లకు సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్లను మరిన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అంతర్జాతీయ మార్కెట్ కు అవసరమైనట్టుగా ఎగుమతులు పెంచేందుకు అత్యుత్తమ గ్రేడింగ్ విధానాలను అమలు చేయాల్సిందిగా సూచించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook 

About the Author

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News