శాసనమండలి రద్దు బిల్లును కేంద్రానికి పంపిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిని రద్దు చేయడానికి ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించిన రాష్ట్ర అసెంబ్లీ సోమవారం  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్ఆర్సిపీ ప్రభుత్వం, కేంద్ర కేబినెట్ కార్యదర్శి, న్యాయ శాఖ, కేంద్ర ఎన్నికల కమిషన్ కు పంపింది.  

Last Updated : Jan 28, 2020, 06:51 PM IST
శాసనమండలి రద్దు బిల్లును కేంద్రానికి పంపిన ఏపీ ప్రభుత్వం

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిని రద్దు చేయడానికి ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించిన రాష్ట్ర అసెంబ్లీ సోమవారం  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్ఆర్సిపీ ప్రభుత్వం, కేంద్ర కేబినెట్ కార్యదర్శి, న్యాయ శాఖ, కేంద్ర ఎన్నికల కమిషన్ కు పంపింది.

కేంద్ర కేబినెట్ సమావేశంలో చర్చ తరువాత, కౌన్సిల్ రద్దు బిల్లును లోకసభ, రాజ్యసభలకు పంపనున్నారు. తర్వాత అధ్యక్షుడి ఆదేశాలతో కౌన్సిల్ రద్దు తీర్మానం అమల్లోకి వస్తుంది.

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణకు సంబంధించిన రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిన తరువాత ఈ పరిస్థితి ఏర్పడింది. కౌన్సిల్‌లో మెజారిటీ లేనందున, సభ్యుల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో పెద్దల సభను రద్దు చేయాలని నిర్ణయించిందని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు పేర్కొన్నారు. 

సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన డ్రాఫ్టు బిల్లుపై సభలో సుదీర్ఘ చర్చ జరిగిన అనంతరం.. సభకు హాజరైన 133 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. సభకు హాజరైన సభ్యులంతా ఓటు వేయడంతో తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం సభలో ప్రకటించారు. రాజ్యాంగంలోని 169 అధికరణ ప్రకారం రద్దు నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటిస్తూ బిల్లు వివరాలను స్పీకర్‌ సభలో చదివి వినిపించారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని ప్రకటించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

More Stories

Trending News