)
AP Govt Gives Green Signal to Airports: కొత్త విమానాశ్రయాల నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ మేరకు గురువారం జరిగిన కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లాలోని కుప్పం, నెల్లూరు జిల్లాలోని దగదర్తిలో.. గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలు నిర్మించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
ఈ రెండు విమానాశ్రయాలను ప్రైవేట్, పబ్లిక్ పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించిన ముసాయిదా ఆర్ఎఫ్పీని మంత్రి మండలి ఆమోదించింది. అంతేకాకుండా యుటిలిటీల బదిలీ ప్రక్రియ పూర్తి చేయడం, హడ్కో రుణంతో భూ సేకరణ, ప్రతిపాదిత ఎయిర్‌పోర్టు కోసం మౌలిక సదుపాయాల కల్పన ప్రతిపాదనలకు మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ ప్రతిపాదించగా కేబినెట్ ఆమోదించింది.
కుప్పం ఎయిర్‌పోర్టు కోసం 1200 ఎకరాలు, దగదర్తి ఎయిర్‌పోర్టు కోసం 1379.71 ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భూ సేకరణ ప్రక్రియ స్పీడప్ చేసి త్వరలో ఎయిర్‌పోర్టుల నిర్మాణ పనులు ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది.
అయితే దగదర్తిలో విమానాశ్రయానికి సంబంధించిన దామవరం, సున్నపుబట్టి గ్రామాల పరిధిలో ఇప్పటికే 669.12 ఎకరాలు సేకరించారు. మిగిలిన 710.59 ఎకరాలు సేకరించాల్సి ఉంది. భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే తుది దశకు చేరుకోగా.. కోర్టు కేసులు కూడా కొలిక్కి వచ్చాయి. దీంతో త్వరితగతిన ఈ భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి.. రైతులకు పరిహారం అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.
ఇదివరకు కుప్పంలో 2019లో శంకుస్థాపన జరిగినా పనులు ముందుకు సాగలేదు. కానీ ఇప్పుడు సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టారు. ఎయిర్‌పోర్టు కోసం మొత్తం 1200 ఎకరాల భూమిని సేకరించాలని కూటమి సర్కార్ లక్ష్యం పెట్టుకుంది. నాలుగు నెలల్లో భూసేకరణ పూర్తి చేసి నిర్మాణం ప్రారంభించాలని భావిస్తున్నారు.
అదే సమయంలో మినీ విమానశ్రయాలు కూడా నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. హెలి పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు హెలికాప్టర్ సేవలను మొదట ప్రయోగాత్మకంగా నడిపేందుకు ఏజెన్సీలను ఆహ్వానిస్తోంది. ఈ ఏజెన్సీల నుంచి వచ్చే ప్రతిపాదనలతో ఎక్కడెక్కడ హెలిప్యాడ్ లు ఏర్పాటు చేయాలో అనేదానిపై చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
ఏజెన్సీలు ముందుకొస్తే విశాఖపట్టణం, విజయవాడ, శ్రీశైలం, అరకులో మినీ విమానాశ్రయాలు నిర్మించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ మినీ ఎయిర్‌పోర్టుల్లో సాధారణ విమానాశ్రయాల్లో ఉండే అన్ని రకాల సౌకర్యాలను కల్పించనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook